
సినిమా విడుదలైతే థియేటర్లలో ఫ్యాన్స్ సందడి చేయడం, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం చూస్తుంటాం. కానీ ఒక సినిమా కోసం థియేటర్లలో ఫుడ్ మెనూనే మార్చేస్తే? ఇప్పుడు రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణ’ విషయంలో ఇలాంటి ఆసక్తికర పరిణామమే చోటుచేసుకుంది. ఈ సినిమా ప్రదర్శించే సమయంలో ఆ థియేటర్లలో నాన్‌వెజ్ ఫుడ్ సర్వ్ చేయకూడదని ఓ మల్టీప్లెక్స్ సంస్థ నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ SVF సినిమాస్ ఈ నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో 30 ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌లు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. ‘రామాయణ’ సినిమా ప్రదర్శించే సమయంలో ఆడిటోరియం లోపల కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే అందించనుంది. అంటే సినిమా చూస్తూ చికెన్, మటన్ వంటి నాన్‌వెజ్ వంటకాలు తినడానికి వీలుండదు.
అయితే ఈ నిబంధన కేవలం ‘రామాయణ’ సినిమాకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. మిగిలిన సినిమాల ప్రదర్శన సమయంలో నాన్‌వెజ్ ఫుడ్‌ను ఎప్పటిలాగే అందిస్తారు. అంతేకాదు.. ‘రామాయణ’ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కూడా ఆడిటోరియం బయట ఉన్న ఫుడ్ కౌంటర్లలో నాన్‌వెజ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆడిటోరియం లోపలికి మాత్రం వెజ్ ఫుడ్ మాత్రమే అనుమతిస్తారు.

హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమా రూపొందడంతో ప్రేక్షకుల భక్తి భావాలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు SVF సినిమాస్ ప్రతినిధి తెలిపారు. సినిమా ప్రదర్శన సమయంలో హనుమాన్ చాలీసా వినిపించినప్పుడు ఆడిటోరియం ఒక దేవాలయంలా అనిపిస్తుందని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఓవర్సీస్ లో రాముడి కలెక్షన్ల తుఫాన్.. 11 రోజుల్లోనే ఆల్-టైమ్ రికార్డు!
గతంలో ‘మహావతార్ నరసింహ’ సినిమా ప్రదర్శన సమయంలో కొందరు ప్రేక్షకులు తమంతట తాముగా చెప్పులు, షూస్‌ను ఆడిటోరియం బయట వదిలి వెళ్లారట. అలాగే ‘హనుమాన్ అంశ్’ సినిమా సమయంలో కూడా ఆడిటోరియంలో వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే అందించాలని కొందరు ప్రేక్షకులు కోరినట్లు సంస్థ వెల్లడించింది. ఆ అనుభవాల నేపథ్యంలోనే ‘రామాయణ’ కోసం ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణ’లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటించారు. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందించిన ఈ సినిమా నవంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.1400 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. ఇండియన్ సినీ రికార్డులను తిరగరాస్తోంది.
మీకు నచ్చవచ్చు:
‘రఘుకుల తిలక’ సాంగ్.. కిరణ్ అబ్బవరం ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
హైదరాబాద్‌లో ఐమాక్స్ రీఎంట్రీ.. ఫస్ట్ మూవీ ఇదే.!
[Ramayana Movie, Kolkata Theatre, Non Veg Food Ban, Ranbir Kapoor, Yash]





