
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అభిమానులకు ఈ ఏడాది చివర్లో అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ‘మాన్‌స్టర్’ టీమ్ సిద్ధమవుతోందట. డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే అభిమానులకు అంతకంటే మంచి బర్త్‌డే గిఫ్ట్ ఏముంటుంది?
సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ పూణేలో ప్రారంభమైంది. నవంబర్ 15 నుంచి మొదలైన ఈ షెడ్యూల్ దాదాపు పది రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో కీలకమైన డ్రామా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సల్మాన్ ఖాన్‌తో పాటు సీమా బిస్వాస్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని అంటున్నారు. పూణే షెడ్యూల్ పూర్తయిన తర్వాత మరో 20 రోజుల షూటింగ్ మిగిలి ఉంటుందని సమాచారం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారట. ప్రస్తుతం ‘బిగ్‌బాస్ 20’ బాధ్యతలతో పాటు సల్మాన్ ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, సల్మాన్ పుట్టినరోజైన డిసెంబర్ 27న ‘మాన్‌స్టర్’ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సినిమాను 2027 ఈద్ సందర్భంగా విడుదల చేయనున్నారు.
ఇది కూడా చదవండి: ‘రామాయణ’ ఎఫెక్ట్.. థియేటర్లలో కొత్త రూల్.. నాన్‌వెజ్ బ్యాన్.!
దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. ప్రస్తుతం ‘మాన్‌స్టర్’ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమే. సల్మాన్ ఖాన్‌తో పాటు నయనతార, జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి, రాహుల్ దేవ్, రోనిత్ రాయ్, సీమా బిస్వాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరి సల్మాన్ పుట్టినరోజున నిజంగానే ఈ సినిమా టీజర్ వస్తుందా? టీజర్‌తో ‘మాన్‌స్టర్’పై అంచనాలు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
15 ఏళ్ల ‘కొలవెరి డి’.. ఆరు నిమిషాల్లో రాసిన పాట ప్రపంచాన్ని ఊపేసింది.!
హైదరాబాద్‌లో ఐమాక్స్ రీఎంట్రీ.. ఫస్ట్ మూవీ ఇదే.!
[Salman Khan Birthday, Monster Teaser, Dil Raju, Nayanthara, Vamshi Paidipally]





