Home

»

Bollywood News

RajaShivaji: రాజా శివాజీ ఓటిటి డేట్ వచ్చేసింది.. స్పెషల్ ఇదే 

Jun 26, 2026 1:10PM

 


మరాఠా యోధుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం   'రాజా శివాజీ. మే 1 న రిలీజయ్యి  రికార్డుల వర్షం కురిపించిన ఈ విజువల్ వండర్ 110 కోట్లకి పైగా కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. టైటిల్ రోల్ ని  రితేష్ దేశ్‌ముఖ్  పోషించడమే కాకుండా  స్వయంగా దర్శకత్వం వహించాడు. ముంబై ఫిల్మ్ కంపెనీ మరియు జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా రితేష్ దేశ్‌ముఖ్ అద్భుతమైన నటన, అజయ్-అతుల్ అందించిన  సంగీతం ప్రేక్షకులని  థియేటర్లకు పరుగులు పెట్టించాయి

ఇప్పుడు ఈ మూవీ  జూన్ 26 అంటే ఈ రోజు నుంచి  ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. మరాఠీ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, విడుదలైన రోజు నుండే అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించింది. చత్రపతి శివాజీ మహారాజ్ వీరగాథను కళ్లకు కట్టినట్లు చూపించగా  ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్‌ని మెప్పించడానికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టింది. బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే,సుమారు ₹75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రన్‌లో 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలనం సృష్టించింది. తద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్-టైమ్ నంబర్ 1 చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతకుముందు రికార్డులో ఉన్న ప్రముఖ సినిమా "సైరాట్" (Sairat) సాధించిన110 కోట్ల రికార్డును ఈ చిత్రం అధిగమించింది. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం నెట్ వసూళ్ల పరంగా 105.26 కోట్లు సాధించి100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మరాఠీ చిత్రంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.


Also read: Ajith kumar: 180 కోట్ల రెమ్యునరేషన్ వివాదం..సంచలన నిర్ణయం తీసుకున్న అజిత్

కేవలం రితేష్ నటన మాత్రమే కాకుండా, ఈ సినిమాలో భారీ తారాగణం నటించడం మరో విశేషం. శివాజీ మహారాజ్ భార్య సాయిబాయి పాత్రలో రితేష్ నిజజీవిత భాగస్వామి జెనీలియా దేశ్‌ముఖ్ నటించగా, శక్తివంతమైన విలన్ అఫ్జల్ ఖాన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించారు. అలాగే విద్యాబాలన్, అభిషేక్ బచ్చన్, ఫర్దీన్ ఖాన్, భాగ్యశ్రీ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. వీటన్నింటికీ మించి బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరవడం అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఈ అద్భుతమైన చారిత్రక కావ్యాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com