Home

»

Latest News

Ajith kumar: 180 కోట్ల రెమ్యునరేషన్ వివాదం..సంచలన నిర్ణయం తీసుకున్న అజిత్

Jun 26, 2026 12:43PM

 

తమిళనాట థలా 'అజిత్' కి ఉన్న స్టార్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. తమిళ రాజకీయాల్ని ఒంటి చేత్తో శాసించే దమ్ము కూడా ఉంది. మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒక సందర్భంలో నా తర్వాత నా రాజకీయ వారసుడు అజిత్ అని కూడా చెప్ప్పిందంటే అజిత్ అనే కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. అటువంటి అజిత్  వెండితెరపై కనిపించి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. 2025 ఏప్రిల్ 10న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది. ఆ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆయన తన 64వ చిత్రాన్ని (AK64) కూడా అదే దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లోనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ సిద్ధమై చాలా నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటా అని ఆరా తీస్తే, అసలు సమస్య అంతా అజిత్ రెమ్యునరేషన్‌తోనే వచ్చిపడిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం అజిత్ కుమార్ ఏకంగా రూ. 180 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి మొదట 'రోమియో పిక్చర్స్' అధినేత రాహుల్ ముందుకు వచ్చినప్పటికీ, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడం వర్కవుట్ కాదని భావించారట. పారితోషికం కాస్త తగ్గించుకోవాలని రాహుల్ కోరిన విజ్ఞప్తిని అజిత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు టాక్ నడుస్తోంది. స్టార్ హీరోల చిత్రాలకు లాభాల్లో షేర్ ఇచ్చే విధానంపై నిర్మాతల మండలి నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో, ఈ రెమ్యునరేషన్ డీల్ కుదరకపోవడంతో సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.


Also read: vijay deverakonda: షూటింగ్ కారవాన్ విషయంలో ఏం జరుగుతుంది.. అసలు నిజం చెప్పిన బడా నిర్మాత


ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అజిత్ కుమార్ ఎవరిపైనా ఆధారపడకుండా ఒక సాహసోపేతమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన సినిమా కోసం ఏకంగా తానే సొంతంగా ఒక నిర్మాణ సంస్థను  స్థాపించి, స్వీయ నిర్మాణంలో ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బెల్జియంలో జరుగుతున్న అంతర్జాతీయ కారు రేసింగ్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న అజిత్, ఆ రేస్ పూర్తి చేసుకుని చెన్నై తిరిగి రాగానే ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉండటంతో, అజిత్ నిర్మాతగా మారబోతున్న ఈ సినిమాపై అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com