
యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నయీ నవేలీ’ నుంచి సెకండ్ సింగిల్ ‘ఫటా పటాకా’ విడుదలైంది. అక్టోబర్ 6న రిలీజైన ఈ పాటలో యామీ గౌతమ్ జాంబీ గ్యాంగ్‌తో కలిసి వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇప్పటివరకు సీరియస్, డిఫరెంట్ రోల్స్‌తో ఆకట్టుకున్న యామీ.. ఈ పాటలో మాత్రం పూర్తిగా ఓవర్ ది టాప్ అవతార్‌లో కనిపించారు. జాంబీ డ్యాన్స్ పార్టీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సాంగ్.. కలర్‌ఫుల్ విజువల్స్, క్విర్కీ కొరియోగ్రఫీతో ఫెస్టివల్ వైబ్‌ను తీసుకొచ్చింది.
‘ఫటా పటాకా’ పాటకు జి.వి. ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించగా.. మధుబంతి బాగ్చి తన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. బీట్ మొదలైన దగ్గరి నుంచి చివరి వరకు ఫుల్ జోష్‌లో సాగేలా పాటను కంపోజ్ చేశారు.
ఇక ఈ సినిమాలో యామీ గౌతమ్ మోహిని అనే పాత్రలో కనిపించనున్నారు. బయటకు చూస్తే పర్ఫెక్ట్ బ్రైడ్‌లా కనిపించే మోహిని.. నిజానికి ఏదో సూపర్‌నేచురల్ సీక్రెట్‌ను దాచిపెట్టుకున్నట్టు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతోంది.
అందుకే ‘ఫటా పటాకా’ పాటలో కనిపిస్తున్న జాంబీ ఎలిమెంట్స్ కూడా సినిమాకు సంబంధించిన కథలో భాగమేనా? లేక కేవలం సాంగ్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా చూపించడానికి మాత్రమే ఉపయోగించారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దర్శకుడు బాలాజీ మోహన్ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో ‘లవ్ ఫెయిల్యూర్’, ‘మారి’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు ఫాంటసీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కెమిస్ట్రీ.. నభా నటేష్‌తో ధృవ సర్జా రొమాన్స్.!
[Phata Patakha Song, Nayyi Navelli Movie, Yami Gautam Zombie Dance, Yami Gautam Dhar, Yami Gautam Dance, GV Prakash Kumar, Madhubanti Bagchi, Director Balaji Mohan, Telugu Film News]




