Home

»

Bollywood News

Dhurandhar 3: ధురంధర్ 3 అప్డేట్..ఈ సారి కాన్సెప్ట్ ఇదే!

Jul 25, 2026 3:25PM

 

ఇండియన్ సినిమా ప్రతాపాన్ని సెల్యులాయిడ్ పై చాలా బలంగా చాటి చెప్పిన చిత్రం ధురంధర్ సిరీస్. పార్ట్ 1 , పార్ట్ 2 ఒక దాన్ని మించి ఒకటి విజయాన్ని అందుకున్నాయి.  కలెక్షన్స్ పరంగా కూడా సరికొత్త రికార్డ్స్ సెట్ చేసి ఉంచాయి. దీంతో పార్ట్ 3 కోసం అందరూ వెయిటింగ్. పైగా పార్ట్ ౩ కోసం కథని సృష్టించాల్సిన అవసరం కూడా లేదు. బోలెడంత కథతో పాటు ఈ సారి రెండు భాగాలని మించిన కథ దొరకడం గ్యారంటీ. ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతం చేసిన జస్కి రాత్ సింగ్ ఉరఫ్ హంజా అలీ మజారి కొడుకు పాకిస్థాన్ లోనే ఉన్నాడు.  


బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న రూమర్స్  ప్రకారం, ధురంధర్ 3 నిర్మాణ పనులు ఇప్పటికే శరవేగంగా ప్లాన్ అవుతున్నాయి. దర్శకుడు ఆదిత్య ధర్, కథారచయితల బృందం ఈసారి కథని మరింత గ్రాండ్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. బడ్జెట్‌ పరంగా కూడా రెండు పార్ట్ లని మించి హై బడ్జెట్ తో  తెరకెక్కిస్తున్నారని,యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్  అత్యున్నత స్థాయిలో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సారి యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను కూడా రంగంలోకి దించుతున్నారని టాక్.


Also read: షాకింగ్ న్యూస్.. భారతదేశ పౌరుడిగా మారనున్న అఖిల్ అక్కినేని 

 విడుదల తేదీ విషయానికొస్తే నిర్మాణ పూర్వ పనులు (Pre-production) మరియు విఎఫ్ఎక్స్ వర్క్ కోసం కనీసం 18 నుండి 22 నెలల సమయం పట్టేలా ఉంది.  ఈసారి కథలో కొత్త పాత్రల ప్రవేశం ఉండటమే కాకుండా, భారతీయ చిత్రసీమలోని ఇద్దరు అగ్ర కథానాయకులు కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి రెండు భాగాలు సాధించిన విజయం, మూడో భాగానికి కొండంత కొండంత అంచనాలను మోసుకొచ్చింది. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చిత్రబృందం ఏ చిన్న విషయంలోనూ రాజీ పడటం లేదు. థియేటర్లలో విజువల్ వండర్‌ను ఆస్వాదించడానికి అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. 

Dhurandhar 2, Dhurandhar, Ranveer Singh, Aditya Dhar 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com