
-లెనిన్ హిట్ జోష్ లో అఖిల్
-తాజాగా వైరల్ అవుతున్న అఖిల్ స్పీచ్
-భారతదేశ పౌరుడిగా మారుతున్నానని ఎందుకు చెప్పాడు
అఖిల్ అక్కినేని(Akhil Akkineni).. ఇప్పుడు నవ యువ సామ్రాట్, రాయల్ కింగ్ గా అభిమానుల చేత నీరాజనాలు అందుకుంటూ లెనిన్ తో దూసుకుపోతున్నాడు. పైగా లెనిన్ ద్వారా అక్కినేని అనే బ్రాండ్ లో ఉన్న నట విశ్వరూపాన్ని చూపించడంతో పాటు తాత అక్కినేని నాగేశ్వరరావు, తండ్రి అఖిల్ ని మించిన పెర్ఫార్మ్ చేసాడని కూడా అందరూ అనేలా చేసాడు. విమర్శకులు కూడా అఖిల్ దెబ్బకి పిన్ ఆఫ్ సైలెంట్. రీసెంట్ గా అఖిల్ ఒక ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం, పౌరసత్వం గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అఖిల్ మాట్లాడుతు నేను అమెరికన్ సిటిజనా లేక ఇండియన్ సిటిజనా అనే ప్రశ్న కొంత మందిలో ఉంది. ప్రస్తుతం నా వద్ద అమెరికా పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ, దానిని రద్దు చేసుకుని పూర్తిస్థాయి భారతీయ పౌరుడిగా మారేందుకు చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయి.
ఇంకొన్ని నెలల్లో అధికారికంగా భారత పౌరుడిని కాబోతున్నాను. ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా నేను భారతీయుడినే, మేరా భారత్ మహాన్. చట్టపరమైన పత్రాలు ఏదైనా కావచ్చు, కానీ నా మూలాలు, భావోద్వేగాలు, ప్రేమ ఎల్లప్పుడూ భారతదేశంతోనే ముడిపడి ఉన్నాయని అఖిల్ పేర్కొన్నారు.
అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్, 1994 ఏప్రిల్ 8వ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న సాన్ జోస్ నగరంలో జన్మించారు. అమెరికా రాజ్యాంగం మరియు అక్కడి చట్టాల ప్రకారం జన్మతః అఖిల్‌కు యుఎస్ పౌరసత్వం లభించింది. ఇప్పటివరకు ఆయన దగ్గర అమెరికన్ పాస్‌పోర్ట్ మాత్రమే ఉంది. లెనిన్ విజయం ఇచ్చిన జోష్ తో పలు క్రేజీ సబ్జెట్స్ వింటూ బిజీగా ఉన్నాడు.
akhil akkineni, lenin






