Home

»

Bollywood News

Dhurandhar 2: 'ధురంధర్ 2' ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్లకి థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

Mar 18, 2026

గతేడాది బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ ని షేక్ చేసింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.1400 కోట్ల గ్రాస్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా 'ధురంధర్ 2' (ధురంధర్: ది రివెంజ్) థియేటర్లలో అడుగు పెట్టింది. ఈరోజు(మార్చి 18) సాయంత్రం నుంచి షోలు మొదలయ్యాయి. ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. (Dhurandhar The Revenge)

ట్విట్టర్ లో వస్తున్న రివ్యూల ప్రకారం.. రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉన్నాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆదిత్య ధర్ టేకింగ్, విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు కురుస్తున్నాయి. 

సినిమా ఫస్టాఫ్ గురించి నెటిజన్ల మాటల్లో చెప్పాలంటే.. కథ చాలా వేగంగా సాగుతూ ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని కొందరు ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేస్తూ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లిందని అంటున్నారు.

'ధురంధర్ 2' ఒక పక్కా విజువల్ స్పెక్టాకిల్ అని, ఆదిత్య ధర్ తన అద్భుతమైన మేకింగ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో హై-వోల్టేజ్ డ్రామా, ఎమోషన్స్ పక్కాగా వర్కవుట్ అయ్యాయని ట్వీట్లు దర్శనమిస్తున్నాయి.

స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచిందని, ప్రతి సీన్ లో రైటింగ్ అద్భుతంగా ఉందని రాసుకొస్తున్నారు. ఇక క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే మాట వినిపిస్తోంది.

మొత్తానికి 'ధురంధర్ 2' కు వస్తున్న ఈ పాజిటివ్ టాక్ చూస్తుంటే.. మరోసారి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయమనిపిస్తోంది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com