
బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘ధురంధర్: ది రివెంజ్’ ఒకటి. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో A సర్టిఫికెట్‌తో విడుదలైంది. ఇప్పుడు టీవీ ప్రీమియర్ కోసం మరోసారి సెన్సార్‌కు వెళ్లగా.. CBFC ఏకంగా 45 నుంచి 50 కట్స్ సూచించినట్లు సమాచారం.
మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’కు అప్పట్లో ‘A’ సర్టిఫికెట్ వచ్చింది. ఒరిజినల్ థియేట్రికల్ వెర్షన్ రన్‌టైమ్ 3 గంటల 49 నిమిషాలు. ఇప్పుడు టీవీ ప్రేక్షకుల కోసం రూపొందించిన కొత్త వెర్షన్‌కు U/A 16+ సర్టిఫికెట్ లభించింది.
అయితే ఈ సర్టిఫికెట్ కోసం సినిమాలోని పలు సన్నివేశాలను కట్ చేయాల్సి వచ్చింది. సీబీఎఫ్‌సీ 45 నుంచి 50 కట్స్ చేయాలని సూచించింది. ఇందులో ఎక్కువగా హింస, రక్తపాతం, గోరీ సీన్లకు సంబంధించిన మార్పులే ఉన్నట్లు సమాచారం.
ఈ మార్పుల తర్వాత సీబీఎఫ్‌సీ సెప్టెంబర్ 24న ‘ధురంధర్: ది రివెంజ్’ టీవీ వెర్షన్‌కు U/A 16+ సర్టిఫికేషన్ ఇచ్చింది. కొత్త వెర్షన్ రన్‌టైమ్ 3 గంటల 39 నిమిషాలు. అంటే థియేటర్ వెర్షన్‌తో పోలిస్తే టీవీలో ప్రసారం కానున్న సినిమా దాదాపు 10 నిమిషాలు తక్కువగా ఉండనుంది.
అయితే కట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమా ఇంపాక్ట్ తగ్గకుండా ఎడిట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా రిపోర్టులు వచ్చాయి. ముఖ్యంగా హింసాత్మక, గోరీ విజువల్స్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.

ఇక టీవీ ప్రీమియర్ విషయానికి వస్తే.. అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం 7 గంటలకు స్టార్ గోల్డ్‌లో ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రసారం కానుంది. థియేటర్లలో A సర్టిఫికెట్‌తో వచ్చిన సినిమా.. ఇప్పుడు U/A 16+ వెర్షన్‌గా బుల్లితెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
మొత్తానికి థియేటర్లలో 3 గంటల 49 నిమిషాల నిడివితో, భారీ హింసాత్మక సన్నివేశాలతో వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’.. ఇప్పుడు టీవీ కోసం దాదాపు 10 నిమిషాలు తగ్గి, U/A 16+ వెర్షన్‌లో రాబోతోంది. మరి థియేటర్లలో చూసిన వెర్షన్‌తో పోలిస్తే ఈ క్లీన్ వెర్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ కోసం రాలేదు.. అరెస్ట్ తర్వాత రమా నందన ఫస్ట్ రియాక్షన్.!
[Dhurandhar 2 TV Version Gets 50 Cuts, Dhurandhar The Revenge TV version, Dhurandhar 2 50 Cuts, Dhurandhar 2 TV Version, Dhurandhar The Revenge, Ranveer Singh, Aditya Dhar, Telugu Film News, Telugu News]




