
బాలీవుడ్ లెజెండ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన హోస్ట్ చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC 18) సెట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రతీరోజూ స్టేజ్ మధ్యలో నిలబడి ఎంతో ఉత్సాహంగా ఓపెనింగ్ మోనోలాగ్ చెప్పే బిగ్ బీ, హఠాత్తుగా కుర్చీలో కూర్చుని షో ప్రారంభించడంతో ఒక్కసారిగా ఆడియన్స్ షాకయ్యారు.
ప్రతిష్టాత్మక 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్ ప్రమాదవశాత్తూ కాలు జారి కిందపడిపోయారు. దాంతో ఆయన ఎడమ మోాలికి తీవ్ర గాయమైంది. ఈ విషయం తెలియని ప్రేక్షకులు షో ప్రారంభంలో ఆయన కూర్చుని కనిపించగానే కాస్త ఆందోళన పడ్డారు. అయితే స్వయంగా అమితాబే తన గాయం గురించి వివరణ ఇచ్చారు.
"నేను సాధారణంగా వేదిక మధ్యలో నిలబడి ఓపెనింగ్ మోనోలాగ్ చెప్తుంటాను. కానీ ఈ రోజు నా ఎడమ మోకాలికి గాయమైంది. నిన్న షూటింగ్ సమయంలో కాలు జారి కిందపడటంతో మోకాలికి దెబ్బ తగిలింది. ప్రస్తుతం నిలబడటం కాస్త కష్టంగా ఉండటంతోనే ఇలా కూర్చుని మాట్లాడుతున్నాను" అని బిగ్ బీ వెల్లడించారు.

82 ఏళ్ల వయసులో కూడా ఆయన చూపిస్తున్న డెడికేషన్, పని పట్ల ఉన్న కమిట్‌మెంట్ చూసి సెట్స్‌లోని ఆడియన్స్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆడియన్స్ ప్రతీ ఒక్కరు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ చప్పట్లతో తమ మద్దతు తెలిపారు.
అయితే, ఇది పెద్ద తీవ్రమైన గాయం ఏమీ కాదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని బిగ్ బీ హామీ ఇచ్చారు. హాట్ సీట్ మీద ఉన్న పోటీదారులతో గేమ్ నడిపేటప్పుడు మాత్రం ఆయన ఎప్పటిలాగే నిలబడే హోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: ప్రభాస్ ఫ్యాన్ to థియేటర్ ఓనర్.. టికెట్ దొరకలేదని ఏకంగా థియేటర్‌నే కొనేశాడు.!
[Amitabh Bachchan Injured, Amitabh Bachchan Knee Injury, Amitabh Bachchan Injured On KBC Sets, Amitabh Bachchan Health Update, Amitabh Bachchan Fall, Kaun Banega Crorepati 18, Big B Health Update, Amitabh Bachchan, Telugu Film News]






