తొమ్మిది సంవత్సరాలుగా శాసిస్తున్న సినిమా.. ఉచితంగా ఇలా చూసేయ్యండి
on Jan 19, 2026

-ఏ మాత్రం తగ్గని క్రేజ్
-మీరు కూడా చూస్తారా
-సస్పెన్సు, థ్రిల్లర్
కొలమానం అనేది లేకుండా ఎంత పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాకైనా సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, ఓటిటి ప్లాట్ ఫార్మ్ పై ఎక్స్ పైరీ డేట్ తప్పదు. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ఎక్స్ పైరీ డేట్ అనేది డిక్షనరీ లో లేనట్టుగా అభిమానులు, ప్రేక్షకుల మద్దతుతో తొమ్మిది సంవత్సరాలుగా ఏకఛత్రాదిపత్యంతో దూసుకెళ్తుంటాయి. మరి ఆ స్థాయి ప్రభావాన్ని చూపిస్తున్న చిత్రమేంటో చూద్దాం.
చట్నీ(Chutney).. తొమ్మిది సంవత్సరాలుగా యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లర్ షార్ట్ ఫిలిం. సుమారు పదిహేడు నిమిషాల నిడివితో తెరకెక్కగా ఏ సీన్ ఆ సీన్ ఊహకి అందని విధంగా సాగుతూ చూస్తున్నంత సేపు మెస్మరైజ్ చేస్తాయి. అంతలా సదరు ఫిలింకి సంబంధించిన కథ, కథనం క్యారక్టర్ డిజైన్స్ రూపొందడం జరిగింది. కథ విషయానికి వస్తే వనిత అనే మహిళ తన భర్త విరి తో సన్నిహితంగా ఉండే మహిళల్ని చంపుతుంటుంది. అటువంటి డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన 'చట్నీ' లో టిస్కా చోప్రా, రసికా దుగ్గల్, ఆదిల్ హుస్సేన్, సుమిత్ గులాటి, ఆకాష్ భరద్వాజ్, దేవేష్ రంజన్ ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపించారు.అవనీష్ మిశ్రా రచించగా జ్యోతి కపూర్ దాస్ దర్శకత్వం వహించాడు.
ఇప్పటికి 144 మిలియన్ల వ్యూస్ ని సంపాదించిన ఈ హిందీ షార్ట్ ఫిలింని యూ ట్యూబ్ లో మీరు కూడా చూసి ఆనందించండి. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ IMDBలో చట్నీ కి 8.8 రేటింగ్ ని ఇవ్వడం విశేషం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



