అలా లిప్‌లాక్స్ చూపించడం కరెక్ట్ కాదు.. లేడీ డాన్ సపోర్టర్స్ ఫైర్!
on Jan 19, 2026
నార్త్ ఇండియాలో సప్నా దీదీ పేరు వార్తల్లో ఎప్ప్పుడూ ఉండేది. ఆమె అసలు పేరు అష్రఫ్‌ఖాన్. ఒక సాధారణ మహిళ లేడీ డాన్‌గా ఎలా మారింది అనే కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ముంబైలో ఆమె పేరు మారు మోగిపోయింది. ఇప్పటికీ ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఆమె గురించి చెప్ప్పుకుంటూ ఉంటారు. కొందరు ఆమెను విమర్శించే వారు ఉన్నారు. అలాగే ఆమెకు మద్దతుగా ఉండేవారు కూడా ఉన్నారు. అయితే ఆమెకు మద్దతుగా ఉండేవారే ఎక్కువని అంటారు.
ఇప్ప్పుడు మరోసారి సప్నా దీదీకి సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఆమె జీవితంతో సినిమా రాబోతోందనే వార్త రావడంతో అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. బాలీవుడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ రూపొందించిన ‘ఓ రోమియో’ సప్నా దీదీ కథాంశమని తెలియడంతో వారు, వీరు అనే తేడా లేకుండా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో సప్నా దీదీని ఎలా చూపిస్తారనే చర్చ మొదలైంది.
ముంబై అండర్ వరల్డ్‌ను కొన్నాళ్లు శాసించిన సప్నాదీదీ జీవితాన్ని, ఆమె క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా చూపించకుండా ముద్దులు పెట్టుకుంటున్నట్టు చూపించడంతో చాలా మంది విమర్శిస్తున్నారు. సప్నా దీదీ వంటి వ్యక్తి సినిమాను ఇలా రొమాంటిక్ మూవీగా తీయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాలోని పాత్ర సప్నా దీదీని పోలి ఉంటే మాత్రం ఆ లిప్‌లాక్ సీన్స్ ఉండకూడదనే డిమాండ్ చేస్తారనే వాదన వినిపిస్తోంది. ప్రజల్లో సినిమాపై వ్యతిరేకత దృష్ట్యా ఆ ముద్దు సీన్స్‌ను తొలగిస్తారా? లేక అలాగే ఉంచుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ అయితేనే గానీ పరిస్థితి ఏమిటి అనేది తెలియదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



