Home

»

Bollywood News

70 ఏళ్ల నిర్మాతతో రిలేషన్‌షిప్... కారు, ఇల్లు ఇస్తా అన్నాడు!

Aug 24, 2026 2:33PM

 


సినిమా..   ఓవర్ నైట్ స్టార్ డమ్ ని తీసుకురావడంతో పాటు న్యాయబద్దంగా కోట్ల రూపాయలని తెచ్చిపెడుతుంది. మూడు తరాలు పాటు కుర్చీని తిన్నా తరిగిపోని ఆస్తులని కూడా ఇవ్వడంలో సినిమా పెద్ద స్పెషలిస్ట్. కాకపోతే  అవకాశాలు రావడం  కష్టమైన పని. 


 అలాంటి సినిమా  వెనుక చీకటి కోణాలు కూడా ఉంటాయనే విషయం మరోసారి నిరూపితమైంది. సంచలన వెబ్ సిరీస్ 'మిర్జాపూర్'లో 'జరీనా' పాత్రతో దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఖ బాలీవుడ్ నటి అనంగ్షా బిస్వాస్. రీసెంట్ గా ఆమె ఒక  ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతు 'నాతో 70 ఏళ్ల వయసున్న ప్రొడ్యూసర్‌ నువ్వు మంచి నటివే, కానీ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చావు కాబట్టి ముంబైలో ఎక్కువ కాలం సర్వైవ్ కాలేవు. నాతో సంవత్సరం పాటు ఉంటే   నీకు లగ్జరీ కారు, ఇల్లు ఇస్తాను. సినిమాల్లో కూడా మంచి అవకాశాలు ఇప్పిస్తానని ఆఫర్ చేసాడు. ఆ మాటలు వినగానే  దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను అంత చెత్త నటినా? నా నటనపై నాకు నమ్మకం ఉంది, అవకాశాల కోసం ఇలాంటి పనులు చేయాలా?” అని మానసికంగా చాలా రాత్రులు కుమిలిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రతిపాదనకు లొంగకూడదని నిర్ణయించుకోవడంతో పాటు మా నాన్నకి  చెప్తే సినిమాలు వద్దంటారని చెప్పలేదు. రీల్ లైఫ్‌లో నేను  పోషించే బోల్డ్, నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ చూసి, రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉంటానని కొందరు నెటిజన్లు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నారు. తెరపై చూసే పాత్రల ఆధారంగా నిజ జీవిత వ్యక్తిత్వాన్ని అంచనా వేయవద్దని కూడా అనంగ్షా చెప్పుకొచ్చింది.


Also Read: వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళని కాపాడిందా!


  2007లో 'ఖోయా ఖోయా చంద్' సినిమాతో వెండితెరకు పరిచయమైన అనంగ్షా, ఆ తర్వాత 'లవ్ షువ్ తే చికెన్ ఖురానా', 'హోస్టేజెస్' వెబ్ సిరీస్, 'బస్తర్: ది నక్సల్ స్టోరీ' వంటి ప్రాజెక్ట్‌లతో వైవిధ్యమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సెప్టెంబర్ లో  'మిర్జాపూర్: ది మూవీ' తో మరో సారి సందడి చేయనుంది.

Anangsha Biswas, Casting Couch Experience, Mirzapur Actress Zarina
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com