
ఇరుముడి... ఇది కేవలం సినిమా కాదు.. ఎంతో మంది ఆశలకి ఉపిరిపోసిన సంజీవిని. జోరు వర్షాల్లో కడుపుకి తింటానికి కూడా కాలు బయటపెట్టకుండా యాప్స్ పై ఆధారపడిన క్లాస్, మాస్ ఫ్యామిలీస్ నిన్న వాన కురుస్తున్నా కూడా చలో టూ ఇరుముడి థియేటర్స్ అని తరలి వెళ్లారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్. సీట్స్ లో ఎక్కడ చూసినా సెవెంటీ పర్శంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి.
ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో ఒక మాట బాగా వినిపిస్తోంది. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గించేశారని, కేవలం మాస్, యాక్షన్ సినిమాలకు మాత్రమే థియేటర్లలో కలెక్షన్లు వస్తాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్ల బాట పడతారని 'ఇరుముడి' సినిమా నిరూపించింది. "ఫ్యామిలీలు థియేటర్లకు రారు" అనే మాట తప్పని నిరూపిస్తూ పరిశ్రమకి, ఫ్యామిలీ చిత్రాలని నిర్మించాలనుకునే మేకర్స్ కి ఒక కొత్త ఆశ, భరోసాని ఇచ్చింది. ముఖ్యంగా వంశపారంపర్యంగా థియేటర్స్ ని నమ్ముకున్న వాళ్ళల్లో జోష్ తీసుకొచ్చింది. థియేటర్స్ లో పని చేసే స్టాఫ్ కి జీతాలు ఇచ్చే ఒకటవ తారీకుకి ఎలాంటి డోకా లేకుండా చేసింది.
Also Read: యాభై భాషల్లో వారణాసి
మొదటి రోజు కేవలం 20 శాతం ఆక్యుపెన్సీతో ప్రారంభమైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే కుటుంబ ప్రేక్షకుల 'మౌత్ టాక్' వల్ల ఏకంగా 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీని నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇదంతా కుటుంబప్రేక్షకుల పుణ్యమే. ఏది ఏమైనా ఇరుముడి లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి ఎంతో అవసరం. రూపాయికి రెండు వందల రూపాయిల లాభాన్ని తెచ్చిపెట్టే దిశగా ఇరుముడి దూసుకెళ్తుంది. మూడు రోజులకి వచ్చిన 80 కోట్లే ఉదాహరణ.
Irumudi, Raviteja, Theaters, ShivaNirvana, PriyaBhavanishankar, Nakshthra
.webp)






