
యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుండి వచ్చిన మొదటి లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఆల్ఫా’ (Alpha) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, శర్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై భారీ అంచనాలు నమోదయ్యాయి. జూలై 3న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే మంచి వసూళ్లనే రాబట్టింది.
ట్రేడ్ లెక్కల ప్రకారం, ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా మొదటి రోజు రూ. 9.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దేశవ్యాప్తంగా దాదాపు 7,534 షోలలో విడుదలైన ఈ చిత్రానికి లభించిన టాక్‌తో పోలిస్తే ఈ ఓపెనింగ్స్ పర్వాలేదనిపిస్తున్నప్పటికీ, స్పై యూనివర్స్ బ్రాండ్ వాల్యూ పరంగా చూస్తే ఇది కొంత స్లో స్టార్ట్ అనే చెప్పాలి.
అయితే, అలియా భట్ గత చిత్రాలతో పోల్చితే మాత్రం ‘ఆల్ఫా’ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. గతంలో విడుదలైన అలియా భట్ ‘రాజీ’ సినిమా మొదటి రోజు రూ. 7.53 కోట్ల నెట్ వసూలు చేయగా, గతేడాది వచ్చిన ‘జిగ్రా’ కేవలం రూ. 4.55 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే సాధించింది. వాటితో పోలిస్తే ‘ఆల్ఫా’ మొదటి రోజే రూ. 9.25 కోట్లతో ఆ సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ను అధిగమించింది.
బాలీవుడ్ హిస్టరీలో మహిళా ప్రధాన చిత్రాల ఓపెనింగ్స్ పరంగా చూస్తే, వీరే ది వెడ్డింగ్ (రూ. 10.70 కోట్లు), గంగూబాయి కతియావాడి (రూ. 10.50 కోట్లు) తర్వాత క్రీ (Crew) సినిమాతో సమానంగా రూ. 9.25 కోట్లతో ‘ఆల్ఫా’ మూడవ అత్యుత్తమ ఓపెనింగ్‌ను నమోదు చేయడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే, ఇండియాలో గ్రాస్ కలెక్షన్లు రూ. 11.10 కోట్లుగా నమోదవగా, ఓవర్సీస్ మార్కెట్ నుండి ఈ చిత్రం మొదటి రోజు రూ. 5 కోట్ల వసూళ్లను సాధించింది. దీనితో ‘ఆల్ఫా’ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్త టోటల్ గ్రాస్ కలెక్షన్ రూ. 16.10 కోట్లకు చేరుకుంది.
యష్ రాజ్ స్పై యూనివర్స్ లోని గత చిత్రాలైన షారూఖ్ ఖాన్ ‘పఠాన్’ (రూ. 57 కోట్లు), గతేడాది వచ్చిన హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ ‘వార్ 2’ (రూ. 52 కోట్లు) సినిమాల రికార్డులతో పోలిస్తే ‘ఆల్ఫా’ కలెక్షన్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆకర్షిస్తోంది.
శివ్ రావల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా నటించగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో మెరిశారు. ముఖ్యంగా ‘వార్’ సిరీస్ నుండి కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ ఇచ్చిన స్పెషల్ కామియో థియేటర్లలో ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్‌గా నిలిచింది. ఈ వీకెండ్‌లో శని, ఆదివారాల బుకింగ్స్ పెరిగితే సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Alia Bhatt, YRF Spy Universe, Alpha Movie, Box Office, TeluguOne





