Home

»

Bollywood News

3 సంవత్సరాల తర్వాత ఓటిటిలోకి వచ్చిన వివాదస్పద మూవీ.. ఓటిటిలో కట్స్ లేకుండానే  

Jul 4, 2026 2:31PM

 


 

స్టార్ హీరో, సింగర్ దిల్జీత్ దోసాంజ్  అత్యంత వివాదాస్పద సామాజిక చిత్రం ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైంది. గత కొన్ని సంవత్సరాలుగా థియేట్రికల్ విడుదల కోసం ఎదురుచూసి, అనేక సెన్సార్ బోర్డు వివాదాల్లో చిక్కుకున్న ఈ మూవీ పేరుని  డిజిటల్ స్ట్రీమింగ్ కోసం మార్చారు. మొదట 'ఘల్లుఘరా' అని, ఆ తర్వాత 'పంజాబ్ '95' అని పిలిచిన ఈ చిత్రానికి, ఇప్పుడు పంజాబ్‌లోని ప్రసిద్ధ నది పేరైన 'సత్లుజ్' అనే కొత్త టైటిల్‌ని  ఖరారు చేశారు. థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక అయిన జీ5 (ZEE5) లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది.

 పంజాబ్‌కి చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. 1980 మరియు 1990ల కాలంలో పంజాబ్‌లో సాగిన తీవ్రవాద అణచివేత చర్యలు, భారీ ఎత్తున జరిగిన అదృశ్యాలు, అలాగే 1984 నుండి 1994 మధ్య కాలంలో వేలాది గుర్తుతెలియని మృతదేహాలను పోలీసులు చట్టవిరుద్ధంగా దహనం చేశారనే ఆరోపణల చుట్టూ కథని తెరకెక్కించారు. ఈ సున్నితమైన, వాస్తవిక అంశాన్ని అన్వేషించినందుకు గాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మూవీపై  తీవ్ర ఆంక్షలు విధించింది. దాదాపు 3 సంవత్సరాల పాటు సెన్సార్ బోర్డుతో మేకర్స్ సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. ఒకానొక దశలో  ఏకంగా 120 కి పైగా కట్స్ మరియు మార్పులను సెన్సార్ బోర్డు సూచించింది.

Also read: Sridevi: 'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవి కీలక ప్రకటన.. నా పేరుతో అవి నడుపుతున్నారు 

దర్శకుడు హనీ ట్రెహన్ మరియు నిర్మాతలు ఈ మార్పులపై బాంబే హైకోర్టును కూడా ఆశ్రయించారు. సున్నితమైన రాజకీయ కారణాల వల్ల 2023 లో ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (TIFF) ప్రీమియర్ లైనప్ నుండి కూడా ఈ మూవీని చివరి నిమిషంలో తొలగించారు. ఇన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు మోక్షం లభించింది. అయితే, తాజాగా విడుదలైన ఈ డిజిటల్ వెర్షన్ ఎలాంటి కట్స్ లేకుండా, ఒరిజినల్ ఫిల్మ్ రూపంలోనే స్ట్రీమింగ్ అవుతోందని చిత్రబృందం స్పష్టం చేసింది. కేవలం సినిమా టైటిల్ మాత్రమే 'సత్లుజ్' గా మారిందని, కథలో ఎలాంటి రాజీ పడలేదని హీరో దిల్జీత్ దోసాంజ్ మరియు దర్శకుడు పేర్కొన్నారు. దిల్జీత్ దోసాంజ్‌తో పాటు అర్జున్ రాంపాల్, సువిందర్ విక్కీ, వరుణ్ బడోలా, గీతికా విద్యా ఓహ్లాన్ ముఖ్య పాత్రలు పోషించారు. పంజాబ్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని కళ్లకు కట్టే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com