English | Telugu
Banner:welfare associations
Rating:2.75
Released On:Apr 13, 2012
ఒక ఆరుగురు స్నేహితులు తాము చేస్తున్న ఉద్యోగాలు నచ్చక ఫేస్ బుక్ లో ఫేక్ ఐ.డి.లను లేకుండా చేసే సాఫ్ట్ వేర్ ని చాలా కష్టపడి తయారు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఫేస్ బుక్ కి సంబంధించిన శ్రీనాథ్ తో మాట్లాడతారు. అక్కణ్ణించి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది. తాము తయారు చేసిన సాఫ్ట్ వేర్ ని తమలో ఒకడైన సూర్య వద్ద ఉంచుతారు అందరూ...! కానీ సూర్య ఒక యాక్సిడెంట్ లో మరణిస్తాడు. సూర్య యాక్సిడెంట్ లో మరణించలేదనీ, అతన్ని ఎవరో హత్యచేశారనీ మిగిలిన ఐదుగురు స్నేహితులకు తెలుస్తుంది. సూర్యని హత్య చేసిందెవరో ఆ స్నేహితులు తెలుసుకోగలిగారా...? సూర్యని ఎవరు, ఎందుకు హత్యచేయవలసి వచ్చింది....? ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ "ఫ్రెండ్స్ బుక్" చూడాల్సిందే.
Analysis :
దర్శకుడిగా ఆర్.పి.పట్నాయక్ తను తీసిన "బ్రోకర్" చిత్రంతోనే నిరూపించుకున్నాడు. ఈ చిత్రంతో మరో మెట్టు పైకెక్కాడని చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫంతా హ్యాపీగా సరదాగా సాగుతుంది. సెకండాఫ్ లో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా మలచటానికి చక్కని స్క్రీన్ ప్లే తోడయ్యింది. పట్నాయక్ టేకింగ్ బాగుంది. ఫేస్ బుక్ అనే సోషల్ నెట్ వర్కింగ్ ని మంచికి ఎలా ఉపయోగించుకోవచ్చో ఈ చిత్రంలో చాలా బాగా చూపించారు...! నిర్మాణపు విలువలు కూడా బాగున్నాయి.
TeluguOne Perspective :
నటన - అందరూ కొత్తవారే అయినా వీరిలో సూర్య, సీనియర్ సురేష్, జెమిని సురేష్ లు పాతవారు. అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సంగీతం - పాటలన్నీ సింపుల్ గా ఉండి వినటానికి హాయిగా ఉన్నాయి. అలాగే రీ-రికార్డింగ్ కూడా బాగుంది.
సినిమాటోగ్రఫీ - చాలా బాగుంది. ముఖ్యంగా లైటింగ్ స్కీమ్ బాగుంది.
మాటలు - అర్థవంతంగా ఉండి బాగున్నాయి.
ఎడిటింగ్ - బాగుంది. ఆర్ట్ - చాలా బాగుంది కొరియోగ్రఫీ, యాక్షన్ ఈ సినిమాకి అవసరం లేదు..
.సో హింస, అసభ్యత, అశ్లీలత లేకుండా, ఒక కొత్తదనంతో కూడిన సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా మీరు నిరభ్యరంతంగా చూడవచ్చు.