- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం - Wasc గుర్తింపు - పత్రికా ప్రకటన
- అమెరికాలో బాలమురళి జయంతోత్సవం జరిపిన సిలికానాంధ్ర సంపద
- క్యాలిఫోర్నియాలో అత్యంత వైభవంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
- అమెరికా వ్యాప్తంగా 10వేలమందికి పైగా విద్యార్ధులతో సిలికానాంధ్ర మనబడి విద్యాసంవత్సరం ప్రారంభం
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా
- భరతనాట్యం కోర్సులు ప్రారంభించనున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం
- చికాగోలో ఘనంగా 5వ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలు
- అమెరికా నాలుగు దిక్కులా మనబడి విద్యార్ధుల పద్యనాటకం
- అమెరికాలో అత్యంత వైభవం గా సిలికానాంధ్ర 609వ అన్నమయ్య జయంతి ఉత్సవం
- తెలుగు సంప్రదాయానికి అద్దం పట్టిన సిలికానాంధ్ర ఉగాది వేడుకలు
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన ఆంధ్రప్రదేశ్ హోం శాఖ అధికారుల బృందం
- దక్షిణాఫ్రికాలో భారత రాయబారి చేతుల మీదుగా సిలికానాంధ్ర మనబడి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం
- ఘనంగా ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తొలి తరగతులు
- సాహో శాతకర్ణి ! - సిలికానాంధ్ర ప్రత్యేక ప్రదర్శన
- సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు
- సిలికానాంధ్ర మనబడి కి ప్రతిష్టాత్మక వాస్క్(wasc) సంస్థ గుర్తింపు
- సిలికాన్ వ్యాలీ లో కన్నుల పండుగగా మనబడి స్నాతకోత్సవం
- 382 మైళ్ళ గోల్డెన్ గేట్ రిలే లో తెలుగు కోసం పరుగిడిన సిలికానాంధ్ర మనబడి బృందం !
- 6000 మంది విద్యార్ధులతో సరికొత్త అధ్యాయం సృష్టించిన సిలికానాంధ్ర మనబడి !
- అమెరికాలో వేలాది విద్యార్ధులతో కోలాహలంగా మనబడి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం!
- Manabadi Telugu Maatlata Finals - Dallas Press Report
- తెలుగు భాషా దినోత్సవం రోజున కాలిఫోర్నియా లో సిలికానాంధ్ర కార్యాలయం ప్రారంభం
- Manabadi Telugu Maatlata National Finals In Dallas
- కనెక్టికట్ లో వెల్లువిరిసిన తెలుగు మాట్లాట పోటీలు
- Telugu Maatlaata In Houston
- ఉత్తర డెట్రాయిట్ సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవం లో విరిసిన చిన్నారి తెలుగు వెలుగులు
- న్యూజెర్సీ మనబడి సాంస్కృతికోత్సవం
- డెట్రాయిట్లో సిలికానాంధ్ర మనబడి మాట్లాట
- ఫీనిక్స్‌లో ఘనంగా సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవాలు
- మిషిగన్‌లో సిలికానాంధ్ర మనబడి 3వ సాంస్కృతికోత్సవం
- కన్నులవిందుగా సిలికానాంధ్ర మన్మథ నామ ఉగాది ఉత్సవం
- ఇల్లినాయిస్లో మనబడి ద్వితీయ వార్షికోత్సవం
- దక్షిణ టెక్సాస్ మనబడి రెండవ సాంస్కృతికోత్సవం
- దక్షిణ కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మనబడి ఐదేళ్ళ పండగ
- అట్లాంటాలో ముగిసిన సిలికానాంధ్ర ‘మనబడి’
- బే ఏరియాలో సిలికానాంధ్ర మనబడి
- డల్లాస్ లో సిలికానాంధ్ర మనబడి కార్యవర్గ సమావేశం
- అట్టహాసంగా మొదలైన సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యాసంవత్సరం
- Siliconandhra Celebrates 13th Anniversary
- Bathukamma & Dasara Sambaralu-2014" Kick Off Meeting
- సిలికానాంధ్ర మనబడి వార్షిక సదస్సు 2014.
- Siliconandhra Manabadi - 2014 Telugu Maatlaata Competitions In Bay Area
- Siliconandhra Sujanaranjani April 2014 Issue Released
- Sri Jaya Nama Ugadi Utsavam On Sunday March 30th 4:30pm
- Siliconandhra Sujanaranjani January 2014 Issue Released
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ వెబ్ సైట్ ప్రారంభోత్సవం
- University Of Silicon Andhra Logo Launch
- Siliconandhra Sujanaranjani August 2013 Issue Released
- సిలికానాంధ్ర విజయనామ ఉగాది కవితల పోటీకి ఆహ్వానం
- Siliconandhra Mana Badi Registrations Open For 2011-12
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి....
- విజయవంతంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి మహా సదస్సు!
- సిలికాన్ వ్యాలీలో అన్నమయ్యకు నాట్య సంగీత ఘననీరాజనం
- అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా, అమెరికా వ్యాప్తంగా 'మనబడి పిల్లల పండగ '
- దక్షిణ కాలిఫోర్నియాలో ఎగిరిన తెలుగు మాట్లాట విజయ పతాకం
సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో నాట్యకీర్తనం
భారతీయ కళలు, సంప్రదాయాలు, మాతృభాషకు పెద్ద పీట వేస్తూ, గత 2 దశాబ్దాలకు పైగా విలక్షణమైన కార్యక్రమాలు నిర్వహించే సిలికానాంధ్ర, ఇప్పుడు SAMPADA ("Silicon Andhra Music, Performing Arts and Dance Academy") ఆధ్వర్యంలో నాట్య కీర్తనం అనే కొత్త కార్యక్రమం ప్రారంభించింది. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమయ్య, భక్త రామదాసు లాంటి మరెంతో మంది వాగ్గేయకారులు మనకు అందించిన సంగీత, సాహిత్య సంపదను శాస్త్రీయ నృత్యాల ద్వారా విస్త్రుత ప్రాచుర్యం కల్పించి వారి గొప్పతనాన్ని భావి తరాలకు అందించాలనే సత్సంకల్పంతో కొన్ని ప్రత్యేక కీర్తనలను ఎంపిక చేసి, అ సాహిత్యం లోని ప్రతి పదానికి , వాక్యానికి తెలుగు మరియు ఆంగ్ల భషలలో అర్ధాన్ని అందించి, కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకోసం ప్రత్యేకంగా స్వరపరచి, నృత్య కళాకారులకు అందుబాటులోకి తీసుకొని రావడమే 'నాట్య కీర్తనం' లక్ష్యమని సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల తెలిపారు.
సంగీత, నాట్య రంగాలలో నిష్ణాతులు మరియు విద్యావేత్తల బృందం సహకారంతో, శ్రీ పప్పు వేణుగోపాల్రావు మరియు అన్నమయ్య కీర్తనలపై అపారమైన పరిశోధనలు చేసిన శ్రీ వేటూరి ఆనంద మూర్తి గారు లాంటి పెద్దల మార్గ నిర్దేశకత్వంలో, సిలికానాంధ్ర విశ్వ విద్యాలయం అధ్యాపకుల సహకారంతో మొదటగా అన్నమయ్య, రామదాసు కీర్తనలను సిద్ధం చేశామని, తొలి ప్రయత్నంగా Dr. అనుపమ కైలాష్ నాయకత్వంలో 10 అన్నమయ్య కీర్తనలకు, Dr.యస్శోద థాకూర్ నాయకత్వంలో 5 రామదాసు కీర్తనలను రికార్డు చేయడం పూర్తయిందని, రాబోయే 2-3 సంవత్సరాలలో , కనీసం 100 కీర్తనలను సిద్ధంచేయాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు, దీని ద్వారా నాట్య కళాకరులలోని సృజనాత్మకతను మరింత గా వెలికితీసే అవకాశం వుంటుందని దీనబాబు కొండుభట్ల తెలిపారు.
నాట్యకీర్తనం ప్రొజెక్ట్ ద్వారా స్వరపరచిన కీర్తనల ప్రచారంలో భాగంగా, భారతదేశంలోనే కాక అమెరికా, యూకే వంటి దేశాలలో స్థిరపడ్డ జాతీయ పురస్కారాలందుకున్న యువ కళాకారులచే నృత్య రీతులను సమకూర్చి జనవరి 23, 24 వ తేదీలలో సామాజిక మాధ్యమాలైన FACEBOOK, YOUTUBE ద్వారా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమాల ప్రత్యక్షప్రసారాలు facebook.com/siliconandhrasampada, youtube.com/sampadatv ద్వారా అందరు చూడవచ్చని సంపద కార్యవర్గ సభ్యులు ఫణిమాధవ్ కస్తూరి తెలిపారు. ఈ ప్రదర్శనలలో అపర్ణ ధూళిపాల (హైదరాబాద్), అవిజిత్ దాస్ (బెంగలూరు), దివ్య రవి(UK), కాశి ఐసోలా(USA), పాయల్ రాంచందాని(UK), T రెడ్డి లక్ష్మి(Delhi), రెంజిత్ & విజ్ఞ (చెన్నై), స్నేహ శశికుమార్(కేరళ), గీతా శిరీష(బెంగళూరు), ఉమా సత్యనారాయణన్(కేరళ) పాల్గొంటుండగా, డా. అనుపమ కైలాష్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.