RELATED NEWS
NEWS
సాహో శాతకర్ణి ! - సిలికానాంధ్ర ప్రత్యేక ప్రదర్శన

 

సాహో శాతకర్ణి ! - సిలికానాంధ్ర ప్రత్యేక ప్రదర్శన

 

 

కాలిఫోర్నియా :  సాన్ హోసె   లోని  టౌన్ 3  థియేటర్ లో  సిలికానాంధ్ర కుటుంబ సభ్యులకోసం ప్రత్యేక ప్రదర్శనగా ఏర్పాటు చేసిన గౌతమి పుత్ర శాతకర్ణి చలన చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. కుటుంబ సమేతంగా విచ్చేసిన సిలికానాంధ్రులు, తెలుగు వాడి పౌరుషాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటే సంభాషణలు పలికిన బాలకృష్ణ సంభాషణా చాతుర్యానికి తమ కరతాళ ధ్వనులతో జేజేలు పలికారు. భారత దేశమంతా తన ఏలికలోకి తెచ్చిన తెలుగు తేజం గౌతమీ పుత్ర శాతకర్ణి చరిత్ర తరువాతి తరాలకు కూడా తెలియాలని, తమ పిల్లలకు చూపించడానికి తీసుకొచ్చామని ఈ సందర్భంగా పలువురు తల్లితండ్రులు పేర్కొన్నారు.

 



సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు   ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం, ఈ మాధ్యమం ద్వారా మన చరిత్రను తెలియజేసే ప్రయత్నం చేసిన దర్శకులు క్రిష్ కు అభినందనలు. ఇక, రాజసం ఉట్టిపడే ఆహార్యం, మాతృ ప్రేమ,దేశ భక్తి, కుటుంబం పట్ల ఆప్యాయత,తనయుడి పట్ల బాధ్యత, యుద్ధ సమయం లో రౌద్ర రస పోషణ లో నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు ని తలపించారని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని గురించి, భారతీయుని పౌరషం గురించి బాలకృష్ణ పలికిన సంభాషణలకు రోమాంచితమైందని అన్నారు. 

మనబడి అద్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, మన సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం, చరిత్ర తెలుసుకోవడానికి భాష ఎంతో ముఖ్యమని, ఎంతో ఘన చరిత్ర కలిగిన మన తెలుగు భాషను ముందు తరాలకు అందించడానికి మనబడి ద్వార కృషి చేస్తున్నామని,  అన్నారు. సిలికానాంధ్ర సభ్యులకు ధియేటర్ వారు ప్రత్యేక స్లైడ్లతో స్వాగతం పలికారు. ఇటీవల విజయవాడలో జరిగిన సిలికానాంధ్ర అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముఖ్య ఘట్టలతో రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు.  ఈ ప్రత్యేక ప్రదర్శనని దీనబాబు కొండుభట్ల సమన్వయపరిచారు.

TeluguOne For Your Business
About TeluguOne
;