RELATED NEWS
NEWS
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన ఆంధ్రప్రదేశ్ హోం శాఖ అధికారుల బృందం

 

 

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ అధికారుల  బృందం

 


 

ఆంధ్ర ప్రదేశ్‌ను అన్ని రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆంధ్ర పోలీస్ ను స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు వివిధ పోలీస్ సంస్థలను పరిశీలించేందుకు  విదేశీ పర్యటనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ హోం డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీస్ ఉన్నాతాధికారుల బృందం మిల్పిటాస్ లోని సిలికానాంధ్ర యూనివర్సిటీలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఏపీ ఎన్ ఆర్ టీ అద్యక్షులు రవి వేమూరి సహకారంతో మిల్పిటాస్ లోని లకిరెడ్డి హనిమిరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో  హోం డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ ఆర్ అనురాధ IPS, మంగళగిరి APSP  కామాండంట్ గోపీనాధ్ జట్టి IPS, ప్రభుత్వ సలహాదారు Dr. గాంధి PC  కాజ బృందం పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ గాంధి మాట్లాడుతూ, సైబర్ నేరాలు అధికమౌతున్న ఈ రోజుల్లో అవి అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని, స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా అమెరికాలోని పోలీస్ వ్యవస్థను, సైబర్ నేరాల పరిశోధన పద్ధతిని స్టడీ చేస్తున్నామని తెలిపారు.

సిలికానాంధ్ర వ్యవస్థాపక అద్యక్షులు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ, సిలికానాంధ్ర ప్రయోగాలకు పుట్టిల్లని, ఎన్నో క్లిష్టమైన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్‌మెంత్, హోం శాఖకు సిలికానాంధ్ర తరఫున ఎలాంటి సహాయం అందించడానికైనా తాము, తమ సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. హోం డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యదర్శి అనూరాధ IPS మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ ను దేశంలోనే ఆదర్శవంతమైన స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

 

సిలికానాంధ్ర సమావేశానికి ముందు మైక్రోసాఫ్ట్ కు అనుబంధ సంస్థ గా ఉన్న MSRCosmos సంస్థ వారు కూడా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ ను స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థ గా తీర్చిదిద్దేందుకు రెడ్ మాండ్ లో మైక్రోసాఫ్ట్ మరియు సియాటిల్ పోలీస్ డిపార్ట్మెంట్ తో  స్మార్ట్ పోలీసింగ్  దిశగా మైక్రోసాఫ్ట్ వినియోగం గురించి  ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసారని, గోపీనాత్ జట్టి వివరించారు.   కార్యక్రమంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ కార్యనిర్వాహకసభ్యులు దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, దీనబాబు కొండుభట్ల, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ ఎన్ ఆర్ టీ చీఫ్ కో ఆర్డినేటర్ బుచ్చిరాం ప్రసాద్ , మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని సమన్వయ పరిచారు.

TeluguOne For Your Business
About TeluguOne
;