RELATED NEWS
NEWS
డెట్రాయిట్‌లో సిలికానాంధ్ర మనబడి మాట్లాట

 



ఉత్తర డెట్రాయిట్ నగరమైన Troy పట్టణంలో, వరుసగా మూడవ ఏడాది, సుమారు40 మంది బాలబాలికలు సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట ఆడి తమ ప్రతిభాపాటవాలతో కనులవిందు గావించారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పలుచోట్ల జరుగుతున్న మాట్లాట ఆటలు - తిరకాటం (Jeopardy-like games), పదరంగం (Telugu spelling bee), ఒక్క నిమిషం మాత్రమే (Telugu Just-a-minute) - ఏప్రిల్ 19న Troy పట్టణంతో దేశమంతా మొదలయ్యాయి.

 



బహుమతి ప్రదానోత్సవంలో ప్రసంగిస్తూ, శ్రీ శ్యామ్ యెనగంటి, శ్రీ కృష్ణ గుడుగుంట్ల, శ్రీ శ్రీనివాస్ తోంటా, ఇక్కడ తెలుగు నేర్చుకుంటున్న పిల్లలు ఎంతో క్లిష్టమైన పదాలను, ఇరకాటం పెట్టే తిరకాటం ప్రశ్నలకు జవాబులిస్తూ అవకాశమిస్తే తెలుగును దూర తీరాలలో కూడా అభివృద్ధి చెయ్యగలమని నిరూపిస్తున్నారని అన్నారు.

 



మిషిగన్‌లో సిలికానాంధ్ర మనబడి దిన దిన ప్రవర్థమానంగా చిన్నారులను ఆకట్టుకుని తెలుగునుఇక్కడి ప్రవాసాంధ్రుల పిల్లలుకు నేర్పుతోంది. ప్రస్తుతం సుమారు ౩౦౦కు పైగా పిల్లలు మిషిగన్‌లో Grand Rapids, Lansing, Ann Arbor, Novi, Canton, Livonian, Troy (2 centers) and Shelby-Township సెంటర్లలోతెలుగు నేర్చుకుంటున్నారు. ఈ మాట్లాట ఆటలు West-Detroit ప్రాంతంలో మే 2న Farmingtonలో జరగనున్నాయి. ఈ ఆటల గురించి, మనబడి కార్యక్రమాల గురించి ఆసక్తి ఉన్నవారు +1 248-602-0909 నంబరుకు TELUGU అని text చెయ్యండి.


ఈ ఆటలలో విజేతలైన చిన్నారులు:

బుడతలు వయోవిభాగం (5 నుండి9 ఏళ్ళు):

తిరకాటం: 1) నిడమర్తి ధృవ సాయి 2) తోంటా నిహార్

పదరంగం: 1) నిడమర్తి ధృవ సాయి  2) ఓరుగంటిశ్రావ్య

ఒక్క నిమిషం మాత్రమే (ఒనిమా): సరళఓనిమా  1) ఐషా జాస్మిన్ షేక్ 2) నిడమర్తి ధృవ సాయి

కొత్త ఓనిమా  1) తోంటా నిహార్ 2) నిడమర్తి ధృవ సాయి

 



సిసింద్రీలు వయోవిభాగం (10 నుండి13 ఏళ్ళు):

తిరకాటం: 1) ముత్యంపేట  మిహిర్ 2) వాయుగండ్ల స్నేహ

పదరంగం: 1) దిడుగు అనిష్క 2) వాయుగండ్ల స్నేహ

ఒక్క నిమిషం మాత్రమే: సరళ ఒనిమా  1) దేవులపల్లి కృష్ణ కౌశిక్ 2) వాయుగండ్ల స్నేహ

కొత్త ఒనిమా  1) ముత్యంపేట  మిహిర్ 2) శ్రీనంద్ అనుమోలు

ఈ మాట్లాట సఫలీకృతం కావడానికి ఎందరో తెలుగు భాషాభిమానులు చేతులు కలిపి పనిచేసారు. అంతేకాక Troy Indian Groceries,Global Enterprise Tech Resources, Inc(GETR), Cogent IBS రాజ/ మహారాజ, పోషకులుగా పిల్లల ఆటలకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు.

 


సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో ఈ ఆటలు ఇంకాఎంతో పైకి ఎదగాలని,ఈ ఆటలు పిల్లలకు తెలుగు నేర్చుకోవడంపై మమకారం పెంపొందించాలని, వారి ప్రతిభా పాటవాలు మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరుకుందాము.

TeluguOne For Your Business
About TeluguOne
;