RELATED NEWS
NEWS
దక్షిణ కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మనబడి ఐదేళ్ళ పండగ


దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలోసిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఐదేళ్ళ పండగగా సాగిన ఈ కార్యక్రమం, దక్షిణ కాలిఫోర్నియాలో రెండు నగరాలలో జరుపుకొన్నారు. ఫిబ్రవరి 21న శనివారం లాస్ అంజేలీస్ నగరంలోజరగగా మరుసటి రోజు ఆదివారం ఫిబ్రవరి 22న శాన్ డియాగో నగరంలో జరిగింది.


రెండు చోట్లా విశిష్ట అతిథులు తెలుగు భాషాజ్యోతిని చేబూని పిల్లలై ముందుండి నడవగా, బ్రహ్మాండమైన శోభాయాత్రతో కార్యక్రమం మొదలై తల్లిదండ్రులకి, పిల్లలకి ఒక అపురూపమైన ఘట్టంగా నిలిచిపోయేలా సాగింది. సిలికానాంధ్ర కులపతి చామర్తి రాజు గారు లాస్ అంజేలీస్లో స్వాగతోపన్యాసంలో మాట్లాడుతూ “ఐదేళ్ళ క్రితం దక్షిణ కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మనబడి ద్వారా మొదలైన తెలుగుభాష ప్రయాణం మహర్దశలో, విన్నూత్నదిశలో సాగుతుంది అనడంలో సందేహం లేదు. మాతృబాషా దిన్సోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఈ ఐదేళ్ళ పండుగ ఎంతో ఆనందదాయకం” అని అన్నారు. శాన్ డియాగోలో మాట్లాడుతూ, “సాన్ డియాగోలో మొట్టమొదటిసారిగా జరుతున్న సాంస్కృతికోత్సవ కార్యక్రమం చూడటం చాల ఆనందదాయకమని, ఇక ప్రతి సంవత్సరం సాన్ దియాగోలో మనబడి సాంస్కృతికోత్సవం జరుపుకుందామని” అని అన్నారు. రెండు కార్యక్రమాలలో ఉపాధ్యాయులను, కార్యకర్తలను జ్ఞాపికలతో సత్కరించగా, లాస్ అంజేలీస్లో గత ఐదు ఏళ్ళుగా మనబడికి భాషా సైనికులై సేవ చేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు.


కార్యక్రమానికి తోటి తెలుగు సంస్థలయిన, NATS (“ఉత్తర అమెరికా తెలుగు సంఘం”) మరియు TASC (దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం)లు మద్దతును, సహాయ సహకారాలను అందించాయి. రాబోయే NATS “అమెరికా తెలుగు సంబరాలు” అధ్యక్షులు Dr. రవీంద్ర ఆలపాటి గారు మాట్లాడుతూ అమెరికాలో పుట్టి పెరుగుతున్న మన పిల్లలకు తెలుగు భాషాభోదన ఎంతో ముఖ్యమని విశదీకరించారు.


లాస్ అంజేలీస్ సాంస్కృతికోత్సవం- మనబడి లో తెలుగు నేర్చుకొనే చిన్నారులకి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు గత ఏడాది అర్హత పరీక్షలు నిర్వహించారు. దేశమంతటా దాదాపు 500 మంది పిల్లలు ఈ పరీక్షలు వ్రాయగా, లాస్ ఏంజెల్స్ లో పరీక్షలో పాల్గొన్న 40 మంది తెలుగు పిల్లలు, అందరూ అత్యున్నత స్థాయిలో ఉత్తీర్ణులయ్యారు. మొట్టమొదటిసారిగా జరిగిన మనబడి స్నాతకోత్సవంలో స్థానిక మనబడి సంధాత డాంజి తోటపల్లి గారు స్నాతకోత్సవం సంచాలకుడిగా వ్యవరించగాసిలికానాంధ్ర మనబడి కులపతిచామర్తిరాజుగారు, మనబడి నిర్వాహక కార్యవర్గం సభ్యులు అనిల్ అన్నం గారు, స్నేహ వేదుల గారు, శ్రీరామ్ కొట్ని గారుగారు, విశిష్ట అతిథులుగా విచ్చేసి, పట్టభద్రులకిలకి పట్టాలు ప్రదానం చేశారు.


తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో సమస్యా పూరణం, మనబడి పాట, తెలుగుభాష పరిణామక్రమము, మీకు తెలుసా?, పండుగలు, బృంద గానం, చెప్పినట్టు చేస్తారా, భారతదేశంలో రాష్త్రాలు, అంత్యాక్షరి, మనబడి గీతం, నీటిఎద్దడి, పువ్వులు, శతకపద్య నాటకం వంటి ప్రదర్శనలతో మనబడి విద్యార్థులు తెలుగు భాషాసంస్కృతులపై తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతో అలరించారు.

మోహన్ కాట్రగడ్డ, కిరణ్ సింహాద్రి, నరేంద్ర కవర్తపు, శ్రీధర్ బండ్లమూడి, సురేష్ చిలుకూరి, సురేష్ బాబు అయినంపూడిల సమర్థవంతమైన నాయకత్వంలో ఈ సభ అత్యంత వైభోగంగా జరిగింది. దోశ ప్లేస్ వారు వచ్చిన అతిథులందరికి చక్కని తెలుగు భోజనం అందించారు.

శాన్ డియాగో సాంస్కృతికోత్సవం-

మొట్టమొదటిసారిగా శాన్ డియాగోలో మనబడి సాంస్కృతికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా తేనెలొలికే పలుకులతో మనబడి గీతo, చెమ్మ చెక్క, చుకు చుకు రైలు పాటలు, దీపావళి వెనుక పురాణం, మిత్రలాభం, మిత్రభేదం, బూరెలమూకుడు, భువనవిజయం, బంగారు గొడ్డలి నాటిక, పరమానందయ్యశిష్యుల కథ, తెలుగు లెస్స నాటికతో పాటు ఎన్నో కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని సాన్ డియాగో పుర ప్రముఖులు, శాన్ డియాగో తెలుగు వాస్తవ్యులు,మనబడి అధ్యాపకులు, కార్యకర్తలు, మనబడి తల్లిదండ్రులు అందరు కలిసి తిలకించి ఆనందించారు. జవహర్ కంభంపాటి, హేమచంద్ర తలగడదీవి, మహేష్ కోయ, ఐశ్వర్య భారతిల నాయకత్వంలో సాన్ డియాగో మనబడి కార్యవర్గం సమర్థవంతంగా నడిపించారు. 8 ఎలిమెంట్స్ వారు భోజనం అందజేశారు.

TeluguOne For Your Business
About TeluguOne
;