RELATED NEWS
NEWS
అట్టహాసంగా మొదలైన సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యాసంవత్సరం

ఉత్తర అమెరికాలో ఇంకా పలు విదేశాలలో సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యాసంవత్సరం అత్యంత కోలాహలంగా, వేలకొలదీ ప్రవాస తెలుగు చిన్నారుల సంప్రదాయ తెలుగుదనంతో నిండుగా ప్రారంభం అయ్యింది.

 

దాదాపు నలభై రాష్ట్రాలలో, 14 విదేశాలలో మనబడి తరగతులు విజయవంతంగా మొదలవడానికి ఎందరో భాషా సైనికులు కృషి చేశారు. తరగతులకై గదుల ఏర్పాట్లు, సమన్వయకర్తలకి , ఉపాధ్యాయులకి తగిన శిక్షణ, పోర్టల్ ద్వారా నమోదు సౌకర్యం,  బడి నిర్వహించడానికి కావాల్సిన పుస్తకాలు, సంచీలు, ట్-షర్ట్లు లాంటి సరంజామా రవాణా మరియు పంపిణీ, ఈ పనులన్నీ, సమర్థవంతంగా, స్వచ్చంద సేవా రూపంలో అందడం, మనబడి జట్టు యొక్క అద్భుతమైన కార్యనిర్వహణ కౌశలానికి సూచన అని మనబడి అధ్యక్షుడు, డీన్ చమర్తి రాజు పేర్కొన్నారు.  సెప్టెంబర్ మాసం 15వ తీదీ వరకూ ఇంకా ఈ  విద్యా సంవత్సరంలో పిల్లలని చేర్చే అవకాశం ఉందని చెప్పారు. పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం వారిచే అర్హత పరీక్షలు నిర్వహించి పదహారు యూనివర్సిటీ గుణాలతో ఒక జూనియర్ సర్టిఫికేట్ , ముప్ఫైరెండు యూనివర్సిటీ గుణాలతో ఒక సీనియర్ సర్టిఫికేట్ అమెరికాలో పిల్లలకి ఒక అద్భుతమైన, కేవలం మనబడి విద్యార్థులకి మాత్రమే అందే ప్రయోజనం అని, రాజు తెలిపారు.

 

ఈ వేసవిలో "ఐదుపది చేద్దాం, ఐదు వేలు తెద్దాం" అన్న నినాదంతో మొదలు పెట్టిన "మనబడి ప్రభంజనం", కార్యక్రమం ఆశించిన ఫలితాలు సాధిస్తోందని, వేలాదిమంది పిల్లలు మనబడిలో చేరుతున్నారని, మనబడి ప్రాచుర్య విభాగం సారధి భాస్కర్ రాయవరం తెలిపారు.  రాబోయే రెండువారాలలో ప్రతి తెలుగువారు, ఇంకొకరికి మనబడి గురించి చెప్పి, వాళ్ళ పిల్లలని మనబడిలో చేర్పించమని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలకు http://www.siliconandhra.org/manabadi సంప్రదించండి.

TeluguOne For Your Business
About TeluguOne
;