RELATED NEWS
NEWS
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు

 

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు

 


అమెరికాలో తెలుగు వెలుగులు విరజిమ్ముతున్న సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో ఇటీవల చికాగోలో వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చికాగోలోని లిబర్టివిల్‌లోని ఓల్డ్ స్కూల్ ఫారెస్ట్ ప్రిజర్వ్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనబడి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు స్థానిక తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిధిగా ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత చంద్రబోస్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరాయి దేశంలో ఉన్నా మాతృభాష మీద మమకారంతో పిల్లలకి తెలుగు భాషను నేర్పిస్తున్న ప్రతి తల్లిదండ్రులని మెచ్చుకున్నారు.

 

తెలుగు భాష చరిత్రను, దాని మాధుర్యాన్ని పిల్లలకు వివరించి తెలుగుభాషను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా తాను రాసిన చిత్రాల్లోని పాటలను ఆయన పాడి వినిపించారు. అనంతరం పిల్లలు భక్తిపాటలు, సుమతి పద్యాలు పాడి వినిపించారు. మనబడి అధ్యాపకురాలు జ్యోత్స్న పాల్వాయి మనబడి తరగతులు, బోధనా పద్థతుల గురించి వివరించారు. మనబడి సమన్వయ కర్త డాక్టర్ వెంకట్ గంగవరపు గారు తెలుగుని స్థానిక స్టీవెన్‌సన్ హైస్కూలులో అంతర్జాతీయ భాషగా గుర్తింపు తేవడానికి మనబడి బృందం చేసిన కృషిని మెచ్చుకున్నారు. అనంతరం పసైందన తెలుగు విందు భోజనాన్ని అతిథులకు వడ్డించారు. ఈ సందర్భంగా చిన్నా, పెద్దా ఆటపాటలతో గడిపారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;