RELATED NEWS
NEWS
మిషిగన్‌లో సిలికానాంధ్ర మనబడి 3వ సాంస్కృతికోత్సవం

 

మిషిగన్‌లో ఈ సంవత్సరం రెండు ప్రాంతాలలో సాంస్కృతికోత్సవం జరుప నిర్ణయించారు. మొదటి సాంస్కృతికోత్సవం నొవై హై స్కూల్‌లో మార్చ్ 29న జరిగింది. ఈ సాంస్కృతికోత్సవంలో Ann Arbor, Canton, Grand Rapids, Lansing, Livonia, Novi మనబడి కేంద్రాల పిల్లలు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు . రెండవ సాంస్కృతికోత్సవం Troy ప్రాంతంలో మే 30న జరుగుతుంది. మనబడి ఆచారం ప్రకారం సాంస్కృతికోత్సవం శోభాయాత్ర మరియు వేద ప్రవచనాలతో శోభాయమానంగా మొదలయింది. గణేశ పంచరత్నం, జయ జయ ప్రియ భారతి పాట, కూచిపూడి నృత్యం, తెలుగు తేజాలు, ఉగాది నాటిక, వేమన సుమతి శతకాలు, రామదాసు కీర్తనలతో ప్రేక్షకులకు కనులవిందు చేసారు.

 

 

బాల బడి చిన్నారులు వారు మనబడిలో నేర్చుకున్న తెలుగు పాటలు పద్యాలూ ఎంతో ఆత్మ విశ్వాసంతో పాడి అందరి అభిమానాలను చూరగొన్నారు. తెలుగు తేజాలు, ఉగాది నాటిక, శ్రావణ భాద్రపదాలు, విక్రం బేతాళ నాటికలు, జొన్నవిత్తుల వారు మన జిల్లాలపై రాసిన పాటకు మనబడి పిల్లల నృత్యం అందరిని అక్కట్టుకుంది. మనబడి కేంద్రాల సమన్వయకర్తలు, గురువులు, తల్లితండ్రులు, వారు తీర్చిదిద్దిన తెలుగు భాషా జ్యోతులు (పిల్లలు) రంగస్థలంపై ప్రదర్శించిన ప్రతిభ పాటవాలను చూసి అబ్బురపోయారు. ఈ పిల్లలు మన తెలుగు భాషా జ్యోతిని గర్వంగా భావి తరాలకు ప్రజ్వలింప చేస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిలికానాంధ్ర మనబడి అభివృద్ధి విభాగం నాయకులు శరత్ వేట వేదికనలంకరించారు. శరత్ వేట పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నిర్వహించిన తెలుగు భాషా పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసారు. వారు మాట్లాడుతూ మనబడి బృందం అమెరికా దేశ వ్యాప్తంగా 40 స్కూల్ డిస్త్రిక్ట్‌లలో తెలుగు భాషకు, ఫారిన్ లాంగ్వేజ్ గుర్తింపు కోసం కృషి చేస్తోందని తెలియజేసారు. మనబడి సమన్వయకర్తలు, గురువులు, స్వచ్చంద సేవకులు, తల్లితండ్రులసహకారంతో మనబడి సాంస్కృతికోత్సవం కనులపండుగా జరిగింది.

TeluguOne For Your Business
About TeluguOne
;