- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం - Wasc గుర్తింపు - పత్రికా ప్రకటన
- అమెరికాలో బాలమురళి జయంతోత్సవం జరిపిన సిలికానాంధ్ర సంపద
- క్యాలిఫోర్నియాలో అత్యంత వైభవంగా సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
- అమెరికా వ్యాప్తంగా 10వేలమందికి పైగా విద్యార్ధులతో సిలికానాంధ్ర మనబడి విద్యాసంవత్సరం ప్రారంభం
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా
- భరతనాట్యం కోర్సులు ప్రారంభించనున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం
- చికాగోలో ఘనంగా 5వ అంతర్జాతీయ తెలుగు మాట్లాట పోటీలు
- అమెరికా నాలుగు దిక్కులా మనబడి విద్యార్ధుల పద్యనాటకం
- అమెరికాలో అత్యంత వైభవం గా సిలికానాంధ్ర 609వ అన్నమయ్య జయంతి ఉత్సవం
- తెలుగు సంప్రదాయానికి అద్దం పట్టిన సిలికానాంధ్ర ఉగాది వేడుకలు
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన ఆంధ్రప్రదేశ్ హోం శాఖ అధికారుల బృందం
- దక్షిణాఫ్రికాలో భారత రాయబారి చేతుల మీదుగా సిలికానాంధ్ర మనబడి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం
- ఘనంగా ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తొలి తరగతులు
- సాహో శాతకర్ణి ! - సిలికానాంధ్ర ప్రత్యేక ప్రదర్శన
- సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాలు
- సిలికానాంధ్ర మనబడి కి ప్రతిష్టాత్మక వాస్క్(wasc) సంస్థ గుర్తింపు
- సిలికాన్ వ్యాలీ లో కన్నుల పండుగగా మనబడి స్నాతకోత్సవం
- 6000 మంది విద్యార్ధులతో సరికొత్త అధ్యాయం సృష్టించిన సిలికానాంధ్ర మనబడి !
- అమెరికాలో వేలాది విద్యార్ధులతో కోలాహలంగా మనబడి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం!
- Manabadi Telugu Maatlata Finals - Dallas Press Report
- తెలుగు భాషా దినోత్సవం రోజున కాలిఫోర్నియా లో సిలికానాంధ్ర కార్యాలయం ప్రారంభం
- Manabadi Telugu Maatlata National Finals In Dallas
- కనెక్టికట్ లో వెల్లువిరిసిన తెలుగు మాట్లాట పోటీలు
- Telugu Maatlaata In Houston
- ఉత్తర డెట్రాయిట్ సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవం లో విరిసిన చిన్నారి తెలుగు వెలుగులు
- న్యూజెర్సీ మనబడి సాంస్కృతికోత్సవం
- డెట్రాయిట్లో సిలికానాంధ్ర మనబడి మాట్లాట
- ఫీనిక్స్‌లో ఘనంగా సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవాలు
- మిషిగన్‌లో సిలికానాంధ్ర మనబడి 3వ సాంస్కృతికోత్సవం
- కన్నులవిందుగా సిలికానాంధ్ర మన్మథ నామ ఉగాది ఉత్సవం
- ఇల్లినాయిస్లో మనబడి ద్వితీయ వార్షికోత్సవం
- దక్షిణ టెక్సాస్ మనబడి రెండవ సాంస్కృతికోత్సవం
- దక్షిణ కాలిఫోర్నియాలో సిలికానాంధ్ర మనబడి ఐదేళ్ళ పండగ
- అట్లాంటాలో ముగిసిన సిలికానాంధ్ర ‘మనబడి’
- బే ఏరియాలో సిలికానాంధ్ర మనబడి
- డల్లాస్ లో సిలికానాంధ్ర మనబడి కార్యవర్గ సమావేశం
- అట్టహాసంగా మొదలైన సిలికానాంధ్ర మనబడి కొత్త విద్యాసంవత్సరం
- Siliconandhra Celebrates 13th Anniversary
- Bathukamma & Dasara Sambaralu-2014" Kick Off Meeting
- సిలికానాంధ్ర మనబడి వార్షిక సదస్సు 2014.
- Siliconandhra Manabadi - 2014 Telugu Maatlaata Competitions In Bay Area
- Siliconandhra Sujanaranjani April 2014 Issue Released
- Sri Jaya Nama Ugadi Utsavam On Sunday March 30th 4:30pm
- Siliconandhra Sujanaranjani January 2014 Issue Released
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ వెబ్ సైట్ ప్రారంభోత్సవం
- University Of Silicon Andhra Logo Launch
- Siliconandhra Sujanaranjani August 2013 Issue Released
- సిలికానాంధ్ర విజయనామ ఉగాది కవితల పోటీకి ఆహ్వానం
- Siliconandhra Mana Badi Registrations Open For 2011-12
- సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి....
- విజయవంతంగా ముగిసిన సిలికానాంధ్ర మనబడి మహా సదస్సు!
- సిలికాన్ వ్యాలీలో అన్నమయ్యకు నాట్య సంగీత ఘననీరాజనం
- అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా, అమెరికా వ్యాప్తంగా 'మనబడి పిల్లల పండగ '
- దక్షిణ కాలిఫోర్నియాలో ఎగిరిన తెలుగు మాట్లాట విజయ పతాకం
382 మైళ్ళ గోల్డెన్ గేట్ రిలే లో తెలుగు కోసం పరుగిడిన సిలికానాంధ్ర మనబడి బృందం !
సాన్ ఫ్రాన్సిస్కో - అమెరికా : తెలుగు ను ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా మార్చాలని పరితపిస్తూ, మాతృభాషను భవిష్యత్తు తరాలకి అందించడం కోసం కల్పించే ప్రాచుర్యం లో భాగంగా, ప్రవాసం లోని తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించే సిలికానాంధ్ర మనబడి మరో విశిష్ట ప్రాచుర్య కార్యక్రమం ద్వారా తెలుగు భాషాప్రేమికులను అలరించింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే 'గోల్డెన్ గేట్ రిలే ' పరుగు పందెం లో, వెంకట బట్టరం గారి నాయకత్వంలో. వీర గుండు కెప్టెన్ గా మనబడి ప్రవేశం, భవ నీలకంఠి కెప్టెన్ గ మనబడి ప్రసూనం అనే రెండు జట్లుగా ఏర్పాటయిన 24 మంది సభ్యుల బృందం, కలిస్తోగా నగరం నుంచి శాంతాక్రూజ్ నగరం వరకు గల 191 మైళ్ళు దూరాన్ని, రెండు జట్లుగా మొత్తం 381 మైళ్ళ దూరాన్ని కొండలు గుట్టలు,అడవులు,ఎండ,చలి,రాత్రిళ్ళు లెక్కచేయకుండా ౩౩ గంటలు నిర్విరామంగా పరిగెత్తి లక్ష్యాన్ని అధిగమించింది.
పందెం లో పాల్గొనే బృందాన్ని అనుసరించే వాహనాలను, ‘మనబడి’, ‘తెలుగుకు పరుగు’ అనే తోరణాలతో అలంకరించటం తెలుగు వారినే కాకుండా , అమెరికన్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దారి పొడుగునా ఎంతోమంది తెలుగు వారు ముందుకి వచ్చి, పరుగెత్తే సభ్యులకు హర్షాతిరేకాలతో వారి సంఘీభావం తెలియచేశారు.తెలుగు భాషను ముందు తరాలకు అనించదానికి సిలికానాంధ్ర చేస్తున్న కృషిని ముఖ్యంగా మనబడి కార్యక్రమం ద్వారా అమెరికా మరియు ఇతర దేశాలలో పిల్లలకు తెలుగు నేర్పటానికి పడుతున్న శ్రమని అభినందించారు.
ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ భాషా సేవయే భావి తరాల సేవ అన్న స్ఫూర్తితో తెలుగు భాషకు ప్రపంచ వేదికపై పట్టం కట్టే బాధ్యతను మోస్తున్నందుకు ఆనందంగా ఉందని , కేవలం 20 మంది తో ప్రారంభమైన మనబడి ఇప్పుడు 6000 మందికి పైగా విద్యార్ధులతో 1000 మందికి పైగా భాషా సైనికుల బోధనలో యూరోప్, ఉక్రైన్,కువైట్,స్కాట్లాండ్,హంగ్ కాంగ్,సౌత్ ఆఫ్రికా, సింగపూర్ వంటి ఎన్నో దేశాలకు విస్తరించిందని తెలిపారు. మే నెల లో జరిగే వార్షిక పరీక్షలు నిర్వహించఛానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అధికారులు అమెరికా చేరుతున్నారని.
అమెరికా వ్యాప్తంగా 24 ప్రాంతాలలో 1025 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరవనున్నారని, ఉత్తీర్ణులైన విద్యార్ధులకు, మే నెల 24 వ తేదీన క్యాలిఫోర్నియా లో జరిగే స్నాతకోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయం అధికారుల చేతులమీదుగా పట్టాలు అందజేస్తామని తెలిపారు. వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరానికి ప్రవేశములు జరుగుతున్నవని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు మనబది.సిలిచొనంధ్ర.ఒర్గ్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-844-626-2234 (BADI)సందర్శించవచ్చని తెలిపారు.
మనబడి బృందం లోని స్నేహ వేదుల మాట్లాడుతూ, ఇప్పటికే మనబడి ద్వారా పిల్లలకు తెలుగు బోధనే కాకుండా బాలానందం, సాంస్కృతికోత్సవాలు, తెలుగు మాట్లాట, పలుకు బడి, పిల్లల పండుగ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలలో స్ఫూర్తి నింపుతున్నామని. ఈ తెలుగుకు పరుగు కార్యక్రమం ద్వారా మనబడి కార్యకలాపాలు మరింతమంది కి చేరువవుతాయని భావిస్తున్నామని వచ్చే విద్యాసంవత్సరానికి 10000 మంది విద్యార్ధులకు తెలుగు నేర్పించే లక్ష్యంగా మనబడి బృందం పనిచేస్తోందని తెలిపారు. ఈ పరుగులో Jayachandra Yanamandala, Prashant Ghattamaneni, Anuradhika kandula, SubbaLakshmi Dhulipala, Vishal Sodem, Harsha Nagaraju, Rajaraman Karuppiah, Bhava Nelakanti, Sivaram Chamiraju, Aravind Srinivasan, Tara Nelakanti, Satish Ananthanarayana, Veera Gundu, Venkata Battaram, Puttapiah Muniyappa, Kishore Varanasi, Raju Chamarthi, Satya vaddavalli, Purna Chitneni, Shobha Charagondla, Gopal Parakulum, Madhu Nagaram, Balaji Subramanyam, Snehalata Vedula పాల్గొన్నారు.