RELATED NEWS
NEWS
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ వెబ్ సైట్ ప్రారంభోత్సవం

 

 

తెలుగు భాష, సంస్కృతి వికాసమే ప్రధానలక్ష్యంగా విదేశీగడ్డపై తొలిసారిగా ఆవిర్భవించిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ వెబ్ సైట్ నేడు సిలికాన్ వ్యాలీలో ఘనంగా ప్రారంభించబడింది. మిల్పిటాస్ నగరంలోని విశ్వవిద్యాలయ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిధిగా విచ్చేసారు. సిలికానాంధ్ర వైస్ చైర్మన్ మరియు విశ్వవిద్యాలయ ముఖ్య ఆడిట్ ఆఫీసర్ కొండిపర్తి దిలీప్ ప్రారంభోపన్యాసం చేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను, ఇతర ప్రముఖులను పరిచయం చేశారు. వెబ్ సైట్ ఆవిష్కరించిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య సిలికానాంధ్ర చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రపంచంలో ఏ తెలుగువాడికి రాని ఆలోచనతో మొదలైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. సదుద్దేశంతో మొదలైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఎలాంటి అడ్డంకులైనా ఎదుర్కొని సఫలీకృతం కావాలని ఆశించారు.

 



ఈ కార్యక్రమానికి ఆహ్వానింపబడిన మరొక అతిధి, రాష్ట్ర జ్ఞానాధారిత సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆత్మకూరి అమరనాథరెడ్డి మాట్లాడుతూ సిలికానాంధ్ర కార్యక్రమాలు ఎల్లప్పుడుతూ తెలుగుదనాన్ని ఉట్టిపడేలా చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమం లో సమాచార సాంకేతిక శాఖ   కార్యదర్శి ,  సంజయ్ జాజు  పాల్గొన్నారు. ముఖ్య విద్యాధికారి చమర్తి రాజు విశ్వవిద్యాలయం ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని సభికులకు వివరించారు. ముఖ్య ఆర్థికాధికారి కొండుభట్ల దీనబాబు గారు మాట్లాడుతూ నూరు మిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో కూడుకున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భావితరాలకు వెలకట్టలేని సంపదగా మిగిలిపోతుందని అన్నారు . సిలికానాంధ్ర వెబ్ సైట్ ని తయారు చేసినఫణి మాధవ్ కస్తూరి ని అభినందించారు.



 
సిలికానాంధ్ర అద్యక్ష్యులు   మాడభూషి విజయసారధి, కార్యవర్గ సభ్యులు   కోట్ని శ్రీరామ్, వంక రత్నమాల, కాజ రామకృష్ణ, మంగళంపల్లి రాజశేఖర్, అజయ్ గంటి ,బే ఏరియాలోని ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ఈ సభలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలం గురించి వివరాలను తెలుసుకోవటానికి http://www.universityofsiliconandhra.org/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చును.

TeluguOne For Your Business
About TeluguOne
;