జగన్ యాంటీ అమరావతి మైండ్ సెట్.. ఒరిగేదేంటంటే?

Publish Date:Jun 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం  హాట్ టాపిక్‌గానే ఉంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత కూడా ఈ వివాదం చల్లారినట్లు కనిపించడం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్  అమరావతి ప్రాంతానికి చెందిన కొందరు రైతులతో ప్రత్యేకంగా సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. కూటమి ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటోందని ఆరోపిస్తున్న కొందరు రైతులతో జగన్ భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సర్వత్రా సాగుతోంది. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులంతా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్నారనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ లైవ్ ప్రసారం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే..  2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.

 అయితే జగన్ ఈ వ్యూహాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు.  ఈ సమావేశానికి వచ్చిన రైతులు అమరావతి ప్రాంతంలో వైసీపీని సమర్థించే ఒక వర్గానికి చెందిన వారని, అక్కడ తీవ్ర అసంతృప్తి ఉందనే రంగు పులిమేందుకే ఈ భేటీని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారని అంటున్నారు. ఈ వ్యూహం సక్సెస్ అయ్యే అవకాశాలు మృగ్యమని విశ్లేషిస్తున్నారు.  

నిజానికి 2019 ఎన్నికల సమయంలో అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు జగన్ కి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. దానికి కారణం ఎన్నికల ముందు ఆయన అమరావతి రాజధానిగానే ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన.  కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన మాట మార్చి మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో రాజధాని ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలూ 2024 ఎన్నికలలో వైసీపీని తిరస్కరించారు. దీంతో ఆయన పార్టీ ఆ ఎన్నికలలో కేవలం  11 స్థానాలకే పరిమితమైంది.

ఇక జగన్ ఇప్పుడు కూడా అదే యాంటీ అమరావతి మైండ్‌సెట్‌తో ముందుకు సాగడం వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు వైసీపీ  మరింత దూరం అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో అమరావతి   రైతులు రాజధాని అమరావతి కోసం   సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర ఉంది.  అలాంటి ప్రాంతంలో మళ్లీ రాజధాని మార్పు అనడం ద్వారా  జగన్ సాధించేది ఏంటని ప్రశ్నిస్తున్నారు.  జగన్ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటం సెల్ఫ్ గోల్ అవుతుందని అంటున్నారు. 

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.