విపత్తు నిర్వహణలో చంద్రబాబు ఆదర్శం: జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం.!

Publish Date:Nov 10, 2026

Advertisement

ప్రకృతి కన్నెర్ర చేస్తే మనిషి చేతులెత్తేయడమే తప్ప మరేం చేయలేడని ఇంత వరకూ అంతా అనుకుంటున్నారు. కానీ ప్రకృతి విపత్తును ఆపలేకపోయినా, ఆ విపత్తు వల్ల కలిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కార్యదక్షతతో నిరూపించారు.  రాష్ట్రంలో ఎదురైన రెండు వరుస పెను తుఫానుల ఉద్ధృతిని సమర్థవంతంగా అడ్డుకోవడంలో అత్యంత ప్రశంసనీయమైన రీతిలో వ్యవహరించారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఆయన తీసుకున్న ముందస్తు చర్యలు, నూతన పద్ధతుల అమలు ఇతరులకు ఆదర్శంగా నిలిచాయి.   ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే క్రమంలో సాంకేతికతను జోడించి ఆయన ముందుకు వెళ్లిన తీరుపై జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ఆధారిత వాతావరణ అంచనాలను ఉపయోగించడం ద్వారా రాబోయే ముప్పును ముందే అంచనా వేసిన చంద్రబాబు.. సమాచార విశ్లేషణ ఆధారంగాయంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో మోహరించారు.   విద్యుత్ సరఫరా పునరుద్ధరణ,  సహాయక చర్యల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి డిస్కం సిబ్బందిని రప్పించడం ఆయన పరిపాలనా దక్షతకు, నష్టాలను, కష్టాలను సత్వరమే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కలగనీయకుండా ఆయన ఎంత చురుకుగా, చొరవగా ముందుకు కదులుతారనడానికి తాజా నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆయన గతంలో కోనసీమ తుపాను సందర్భంగా సహాయ పునరావాస చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన తీరును గుర్తు చేస్తున్నారు. అప్పట్లో స్థానిక అధికారుల కంటే ముందుగా ఆయన ఉప్పెన ప్రభావిత ప్రాంతానికి చేరుకోవడం, రాజమండ్రికి ఆయన కార్యస్థలంగా మార్చుకుని రేయింబవళ్లు శ్రమించి సత్వరమే పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకువచ్చిన విషయాన్ని ఉదహరిస్తున్నారు. అలాగే విశాఖను హుద్ హుద్ తుపాను అతలాకుతలం చేసిన సందర్భంలోనూ ఆయన అరహారం శ్రమించి స్వల్ప వ్యవధిలోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసిన తీరును వివరిస్తున్నారు. 

ఇప్పుడు తాజాగా రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 

ఇది కూడా చదవండి:  పెను తుపాను తలొంచి చూసే తొలి నిప్పుకణం: చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ప్రశంసలు.!

సంక్షోభ సమయంలో అధికారులను సమన్వయం చేస్తూ తీసుకున్న చొరవ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది.   76 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం విశ్రాంతి కోరుకోకుండా, నిరంతరం ప్రజల క్షేమం కోసం తపించడం ఆయన నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతోందని జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది,

 ఈ  క్రియాశీలక పాలన (ప్రోయాక్టివ్ గవర్నెన్స్) విధానం మిగతా రాజకీయ నాయకులకు   రోల్ మోడల్ లాంటిదని పరిశీలకులు అంటున్నారు.   భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు మరింత వేగంగా స్పందించేందుకు ఈ తరహా సాంకేతిక విధానాలు దోహదపడతాయి. నాయకత్వంలో   ముందుచూపు, పట్టుదల ఉంటే ఎంతటి క్లిష్ట సమస్యనైనా, ఎలాంటి పెను విపత్తునైనా సులువుగా అధిగమించవచ్చని చంద్రబాబు చేతలలో నిరూపించారని చెబుతున్నారు. 

మీకు నచ్చవచ్చు: మురసు తుఫానుతో ఏపీకి రూ.1,918 కోట్ల నష్టం.!

మురసు తుపాను నష్టాలపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.!

[Chandrababu Naidu Proactive Governance, Andhra Pradesh CM, Cyclone Mitigation, AI Forecasting, Minimise, Loss, Telugu One]

By
en-us Political News

  
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.