వైనాట్ కుప్పం నుంచి పులివెందులలో ఓటమి వరకూ: జగన్ పతన ప్రస్థానం.!

Publish Date:Nov 3, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు   చారిత్రకమైనవిగా నిలిచాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ 151 స్థానాలను కైవసం చేసుకుని అఖండ విజయం సాధించింది. ఈ విజయంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల కథ ముగిసిపోయిందని అప్పట్లో  పరిశీలకులు విశ్లేషణలు చేశారు. ఆ ఫలితాల మత్తులోఆ సమయంలో ఆ విజయంపై జగన్ హర్షం వ్యక్తం చేస్తూ తదుపరి ఎన్నికలలో వైనాట్ 175 అంటే వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే వైనాట్ కుప్పం అని కూడా ప్రకటించారు. 2024 ఎన్నికలకు ముందు కుప్పంలో విజయంపై భారీ భారీ ప్రకటనలూ చేశారు. అంతే కాకుండా వైనాట్ కుప్పం అన్న నినాదాన్ని బలంగా ప్రజలలోకి తీసుకు వెళ్లారు.  

కుప్పం నియోజకవర్గంలో  పట్టు సాధించాలనే ఉద్దేశంతో  వైసీపీ నాయకత్వం చేయని ప్రయత్నం లేదు. జగన్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక వ్యూహాలు అమలు చేయడంతో, 2021లో కుప్పం మున్సిపాలిటీని వైపీపీ కైవసం చేసుకుంది. ఆ సందర్భంగా జగన్ అతికి పోయి.. ఇప్పుడు చంద్రబాబు ముఖం చూడాలని ఉందంటూ వ్యాఖ్యానించారు. అయితే 2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది.

ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన పురపోరులో పులివెందుల మునిసిపాలిటీలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఒకప్పుడు చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు సొంత నియోజకవర్గమైన పులివెందులలో పట్టు కోల్పోయి, మునిసిపాలిటీని కోల్పోయిన పరిస్థితి ఎదురైంది. చరిత్రలో తొలిసారిగా పులివెందుల కంచుకోటను తెలుగుదేశం బద్దలు కొట్టడం సంచలనంగా మారింది. 

2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో పులివెందులలో జగన్ మెజారిటీ దాదాపు 30 వేలు తగ్గింది. తాజాగా పులివెందుల గడ్డపైనే టీడీపీ విజయం సాధించడం ఆ పతనాన్ని మరింత పెంచింది. 2019 విజయం తర్వాత మరింత దూకుడుగా వ్యవహరించిన జగన్, కుప్పంలో పాగా వేసి చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయాలని భావించారు.  అయితే   అదే వ్యూహం ఇప్పుడు రివర్స్ అయ్యింది. పులివెందుల మునిసిపాలిటీలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది.   

[Why not Kuppam to Pulivendula defeat,  Jagan, Pulivendula, Kuppam, TDP, Andhra Pradesh Politics, Chandrababu Naidu, AP Localbody Elections, Telugu One]

By
en-us Political News

  
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.