బాబుపై కేటీఆర్ ప్రశంసలు: మారిపోయారా.. మరిచిపోయారా.?

Publish Date:Oct 30, 2026

Advertisement

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారాలు ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సమయం, సందర్భం కల్పించుకుని మరీ చంద్రబాబు విజనరీనీ, పాలనా దక్షతనూ ప్రస్తుతిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే  కేటీఆర్ గతంలో పలు సందర్భాలలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు. 

జగన్ హయాంలో అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా హైదరాబాద్ లో ఆందోళనకు దిగిన టెక్కీలను తప్పుపట్టారు. ఆ ఆందోళనను అణచివేయడానికి శతధా ప్రయత్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్, ఏపీలో జగన్ సర్కార్ పతనమైన తరువాత కూడా  ఆయన చంద్రబాబుపై పలు సందర్భాలలో విమర్శలు గుప్పించారు. వైసీపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

తాజాగా తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై, రేవంత్ సర్కార్ పని తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు.  ఏపీలో తెలంగాణ కంటే తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ,  చంద్రబాబు అత్యంత సమర్థవంతంగా మేనేజ్ చేశారని ప్రస్తుతించారు.  పొరుగున ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే కరువు ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నదన్న కేటీఆర్  ఏపీలో లోటు వర్షపాతం  ఉన్నప్పటికీ, చంద్రబాబు సర్కార్  నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ రైతులను, ప్రజలను ఆదుకుంటోందన్నారు.

అదే సమయంలో  తెలంగాణలో   పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ,   ప్రణాళికాలోపం,  ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై స్వయంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారంటూ పలు వ్యాఖ్యలను గుర్తుచేశారు. పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటమే పనిగా పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  

[KTR  Praises Chandrababu Naidu, Political, Importance, Jagan, Ycp, Telangana politics, Revanth Reddy, Drought Management, Telugu One]

By
en-us Political News

  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.