బొద్దింకల ఉద్యమం: ఓ హిస్టారికల్ నెసిసిటీ.!
Publish Date:Oct 24, 2026
Advertisement
ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ సంస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు ప్రజా ఉద్యమాలు పోటెత్తడం సహజం. ఇండియాలో ఇప్పుడు అదే జరుగుతోంది. దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు, , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆ వైఫల్యాల ఫలితమే దేశంలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న పోరాట జ్వాలలు, నిరసనల మంటలు. ముఖ్యంగా బొద్దింకల వీధి పోరాటాలు.. కేంద్రంలోని మోడీ సర్కార్ పునాదులను కదిలిస్తున్నాయి. కనీసం కదులుతున్నాయన్న భయాన్ని మోడీషాలో వ్యక్తమయ్యేలా ఈ ఉద్యమాలు చేశాయి. అన్ని వ్యవస్థలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకున్న తర్వాత న్యాయం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అందుతోదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఇలాంట పరిస్థితి ఏర్పడించి కానీ.. ఇంతల ఈ రాజ్యంగ సంస్థలను వ్యవస్థీకృతంగా గుప్పెట పెట్టుకున్న సందర్భం మాత్రం గతంలో ఎన్నడూ లేదు. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆందోళనలతో తీవ్రమైన చిక్కులు ఎదుర్కున్న కేంద్ర ప్రభుత్వం జంతర్ మంతర్‌ను ఆందోళనల నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ఆందోళనలకు, ధర్నాలకు ఇంత కాలం వేదికగా వుంటూ వస్తున్న జంతర్ మంతర్ ఇప్పుడు ఆందుకు ఏ మాత్రం అవకాశం లేని ప్రాంతంగా మారిపోయింది. అయితే, సిజెపి నాయకులు ఆశుతోష్ రానా, సౌరవ్ దాస్ జంతర్ మంతర్‌లో జాతీయ పతాకాన్ని ఎగురేసినందుకు అరెస్టయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసినందుకు అరెస్టయిన తొలి భారతీయులుగా వారు చరిత్రలో నిలిచిపోతారు వారిని అరెస్టు చేసి తీహార్ జైలులో వుంచి, బెయిల్ ఇవ్వడానికి అనేక సాకులు చూపుతూ వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అవసరమైన షూరిటీలు సమర్పించినప్పటికీ వారి విడుదలకు అడ్డంకులు సృష్టించారు. అది పక్కన పెడితే.. అంకితా భండారి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమిస్సూ నిస్పిగ్గుగా వ్యవహరించింది కేంద్రం. అలా నియమించడం ద్వారా హత్య కేసులో విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా దుష్యంత్ కుమార్ గౌతమ్ కు వెసులుబాటు కల్పించింది. ఇక ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి నుంచి పోటీ చేయడానికి ఉత్సుకత చూపిన హత్య కేసులో దోషిగా నిర్దారించబడిన దోషి నందలాల్ రాయ్ అలియాస్ బబ్లూ రాయ్‌ని అలహాబాద్ హైకోర్టు విడుదల చేసింది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. జంతర్ మంతర్ వద్ద జాతీయ పతకాన్ని ఎగురవేసిన ఇద్దరు యువకులకు బెయిల్ ఇవ్వడానికి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రితూ రాజ్ మీనమేషాలు లెక్కించారు. షూరిటీ ఇవ్వడానికి వచ్చిన ఓ వ్యక్తి జుట్టు ఆధార్ కార్డులో అతపి ఫొటోలో వున్న జుట్టులా లేదంటూ అభ్యంతరం చెప్పారు. షూరిటీలు అంగీకరించకుండా వారిద్దరి జ్యుడిషియల్ కస్టడీని పొడగించారు. గ్యాంగస్టర్లు, రేపిస్టులు, హంతకులు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ సీజేపీ కీలక నాయకుడు ధ్రువ్ రాఠీ విమర్శించడాన్ని, అకారణంగా ఆశుతోష్ రానా, సౌరవ్ దాస్ జ్యుడిషియల్ కస్టడీనికి పొడగించారనీ, కళ్ల ముందే న్యాయవ్యవస్థ విఫలమవుతున్నదనడానికి ఇదే నిదర్శనమని సీజేపీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్న సింగ్ ఆక్షేపించడాన్నిఎవరూ తప్పుపట్టలేరు. ఎన్నికల ర్యాలీల సందర్భంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు కావడం లేదా, నిరసనల వల్ల మాత్రమే ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయా అంటూ పలువురు ప్రశ్నించడాన్ని కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. న్యాయం ఒకేరకంగా అందరికీ అందడం లేదనడానికి ఆశుతోష్ రానా, సౌరవ్ దాస్ ఉదంతమే తాజా నిదర్శనం. [CJP Agitation Historic Necicity, Jantar Mantar Protests,Arrest Ashutosh Rana, Dhruv Rathee,Constitutional Institutions, Telugu One]
http://www.teluguone.com/news/content/cjp-agitation-historic-necicity-45-235290.html




