ఏపీలోనే దిక్కు లేదు.. ఇక్కడేం సీఎం అవుతాను?

Publish Date:Jun 3, 2026

Advertisement

ఈ కామెంట్లను ఎలా అర్ధం చేసుకోవాలి? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. కావాలంటే చూడండి.. పవన్ ఇందులో చాలా పెద్ద వ్యూహరచన సిద్ధం చేశారనే చెప్పాలంటారు మరి కొందరు. ఈ మాటలోంచి ఆయన ఓ రెండు వర్గాల వారిని గట్టిగానే లాగిపెట్టి కొట్టారు. అందులో మొదటిది తన కులం కాగా, రెండోది అభిమానగణం.  ఆంధ్రప్రదేశ్ లో  అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని  కదా? అని ప్రశ్నిస్తారు పవన్. ఫైనల్ గా 2024 ఎన్నికల్లో గెలిస్తే.. అది కూటమి ఓటు బ్యాంకు వల్ల. ఇక రెండోది ఆయన అభిమానగణం రచ్చ రావిడి చేయడానికి తప్ప అది ఓటు బ్యాంకుగా మారిందే లేదు. ఈ విషయంలోనూ ఆయనకో క్లారిటీ ఉంది. వాళ్లేదో క్రేజ్ కొద్దీ గొడవలకు పాల్పడ్డం తప్ప.. ఆయనకంటూ ఇప్పటి వరకూ ఓటర్లుగా మారి వర్క్ చేసిందే లేదన్న నిశ్చితాభిప్రాయం పవన్  కల్యాణ్ ది.

ఇలా వీరిని టార్గెట్ చేస్తూనే ఇటు తెలంగాణలో తనకు ఏపీలో అంతంత మాత్రం బలం ఉందంటూ.. తనను తానొక లైట్ పవర్డ్ పొలిటీషియన్ గా చెప్పుకోవడం అనేదొక ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్‌ పెద్ద పోటీ కాదులే అన్న తలంపు ఇక్కడ రాజకీయనాయకులకు వస్తుందన్నది ఆయన వ్యూహం కావచ్చు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే  అనిరుధ్ రెడ్డి ఒక కొత్త పాయింట్ లేవదీశారు. అదేంటంటే పవన్ కళ్యాణ్‌,  అమిత్ షాను  కలిసినపుడు.. తెలంగాణ కూటమి వ్యవహారం మాట్లాడి ఉంటారనీ,  దాని ప్రభావమే ఆయన ఇక్కడ నవ నిర్మాణ సభ ఏర్పాటు అన్నారాయన.  

ఇదంతా ఇలా ఉంటే పవన్ హిమ్ సెల్ఫ్.. ఇక్కడ టీడీపీ తమతో కలుస్తుందో లేదో కూడా తమకు తెలీదని అన్నారు. అంతే కాదు..  బీజేపీ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ లేనట్టే మాట్లాడారు. కానీ అనిరుధ్ మాటలను బట్టీ చూస్తే..  తెలంగాణలో బీఆర్ఎస్- బీజేపీ- జనసేన కూటమి కట్టి.. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆపై రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోరాడనున్నట్టు తెలుస్తోంది.

అంటే ఏపీలో కూటమిలోని ప్రధాన పార్టీ తెలంగాణలో లేదన్న సంకేతాలను ఇచ్చారు పవన్. ఆపై తమతో ఎవరు కూటమి కట్టినా కట్టకపోయినా జీహెచ్ఎంసీ నుంచి మొదలు పెడితే..   తెలంగాణలో అన్ని ఎన్నికల్లోనూ తాము పాల్గొంటామని గ్లాసు బద్దలు కొట్టేశారు పవన్ కళ్యాణ్‌. దానికి తోడు గోదావరి నదితో తనను తాను పోల్చుకున్నారు. ఎక్కడో పుట్టిన గోదావరి తెలంగాణలోనూ ప్రవహించడం లేదా? తాను కూడా అంతే అన్నారాయన. దానికి తోడు పుష్కర కాలం కిందట ఆంధ్రలో రాజకీయాలు చేయడానికి గానూ తెలంగాణ లో పుట్టిందాయన పార్టీ జనసేన. అచ్చం ఆయనలాగే.

ఎక్కడో ఏపీలోని బాపట్లలో పుట్టి- నెల్లూరులో చదివి- చెన్నైలో ఎదిగి- హైదరాబాద్ కి వచ్చి పలు సినిమాల్లో నటించి.. తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఆపై ఎన్నో వైఫల్యాలను ఎదుర్కుని.. అటు పిమ్మట గత ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన పవన్ సేన.. దేశ వ్యాప్తంగా విస్తరించడానికి ఎన్నో యత్నాలు చేస్తూనే ఉంది.. ఇటీవల కేరళలో కూడా తమ పార్టీని ఏర్పాటు చేయాలని చూసింది.  అలాంటి జనసేనాని పవన్ ఏపీలో తనకు సీఎం అయ్యే దిక్కులేదనడమేంటి? ఇక్కడ అంటే తెలంగాణలో సీఎం కావడం కూడానా? అనడంలో తాత్పర్యమేంటి? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది.

అయితే పవన్ ఇలా లైటర్ వాన్ డైలాగ్స్ కొడుతూ.. జనాన్ని ఒకానొక గందరగోళంలో పెడుతూనే.. తన ప్రస్ధానం కొనసాగిస్తూ వస్తారనీ.. అదాయన రాజకీయ శైలిగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలా అంటూనే ఆయన ఇప్పటి వరకూ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాగలిగారనీ.. ఆపై ఆయన టార్గెట్ సీఎం కూడా అయి ఉండొచ్చనీ.. ఏమో కాలం ధర్మ కలిసి వస్తే- వచ్చే రోజుల్లో ఆయన తెలంగాణకు సీఎం అయినా అవుతారనీ అంటారు కొందరు.  ఏమో గుర్రం ఎగురావచ్చనే ఈ కాన్సెప్ట్ లో భాగంగా.. పవన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారో చూడాలి మరి.

By
en-us Political News

  
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.