కేవీపీ సవాల్.. పవన్ స్పందనేంటి? జగన్ సైలెన్స్ కి కారణమేంటి?

Publish Date:Jun 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వైసీపీపై కానీ, జగన్ పై కానీ, వైఎస్ రాజశేఖరరెడ్డిపై కానీ విమర్శలు చేస్తే.. వైసీపీ అధినేత, వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రియాక్ట్ కావాలి. కానీ అదేంటో.. వైఎస్ బతికి ఉన్న సమయంలో ఆయన ఆత్మగా గుర్తింపు పొందిన కేవీపీ రామచంద్రరావు రియాక్ట్ అయ్యారు. తాజాగా పవన్ కల్యాణ్ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనను తీవ్రంగా వేధించారని, తనపై అక్రమ కేసులు పెట్టాలంటూ అప్పట్లో ఒక ఐపీఎస్ అధికారికి స్వయంగా పురమాయించారంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈ వ్యాఖ్యలు   పాత జ్ఞాపకాలను, నాటి రాజకీయ గొడవలను మరోసారి తెరపైకి తెచ్చాయి. పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై వైఎస్ ఆత్మగా చెప్పుకునే  కేవీపీ రామచంద్రరావు సీరియస్ గా రియాక్టయ్యారు.   

పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్  ప్రతిష్ట  మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ,  పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని  నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి  తన సొంత సొమ్ము నుంచి  10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే..  పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్  కుటుంబానికి, ఆయన  అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు. కేవీపీ విసిరిన ఈ 10 కోట్ల రూపాయల ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 వైఎస్ రాజశేఖర రెడ్డి  వారసత్వాన్ని భుజాన వేసుకుని  ఒక సారి ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత, వైఎస్ కుమారుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి  పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కేవీపీ ప్రశ్నించారు. వైఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా  తీవ్రమైన ఆరోపణలు  చేస్తుంటే..  కొడుకుగా జగన్ కి కోపం, రోషం రావాలి, కానీ, ఆయనకు అలాంటివేవీ ఎందుకు రావడం లేదని ఫైర్ అయ్యారు.  

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రతి చిన్న అంశం కేవీపీ రామచంద్రరావు కనుసన్నల్లోనే జరిగేది. వైఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా..  ఎవరికి ఏ ఆదేశాలు ఇచ్చినా అందులో కేవీపీ భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండేది.   పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఒక ఐపీఎస్ అధికారిని పిలిచి వేధించమనే ఆదేశాలు వైఎస్సార్ ఇచ్చి ఉంటే.. ఆ విషయం కేవీపీ రామచంద్రరావుకు తెలియకుండా జరిగే ఛాన్సే లేదు. ఆ పూర్తి నమ్మకంతోనే, తన మిత్రుడి క్యారెక్టర్ ఏంటో తనకు పూర్తిగా తెలుసు కాబట్టే, కేవీపీ అంత గట్టిగా, అంతటి భారీ మొత్తాన్ని పణంగా పెట్టి పవన్‌కు సవాల్ విసిరారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సవాల్‌పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

By
en-us Political News

  
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.