పొత్తు ధర్మం తెలుగుదేశం పాటిస్తే సరిపోతుందా: పవన్ మౌనం వెనుక సంకేతమేంటి.?

Publish Date:Oct 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో పొత్తు ధర్మం పాటించాల్సిన అవసరాన్ని జనసేన విస్మరించిందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఎవరైనా ఔనన్న సమాధానమే ఇస్తారు. స్థానిక ఎన్నికల వేళ సీట్ల సర్దు పాట్లు సజావుగా జరిగాయని కూటమి పార్టీల అగ్రనేతలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జన సేన పార్టీల నుంచి రెబల్స్ రంగంలోకి దిగారు. ఇప్పుడు ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 

ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... తెలుగుదశం రెబల్స్ కు చంద్రబాబునాయుడు అల్టిమేటం జారీ చేశారు. స్థానక ఎన్నికలలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని విస్పష్ట సందేశం పంపారు. నామినేషన్లు ఉపసంహరించుకోకుంటే సస్పెన్షన్ తప్పదన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి పొత్తు ధర్మానికి అనుగుణంగా చంద్రబాబు విస్పష్ట నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలు, శ్రేణులకు అందుకు అనుగుణంగా హెచ్చరికలు జారీ చేశారు. 

అయితే అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం తమ పార్టీ రెబల్స్ విషయంలో మౌనం వహించారు. ఇంత వరకూ ఆ పార్టీ రెబల్స్ కు ఎటువంటి హెచ్చరికా జారీ చేయలేదు. ఇది అలుసుగా తీసుకుని జనసైనికులు, ఆ పార్టీ నేతలు లక్ష్మణ రేఖ దాటి తెలుగుదేశం పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  

ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 30% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ ఈ వివాదాన్ని   తీవ్రతరం చేశారు. అక్టోబర్ 21న ఆయన తమ 30శాతం సీట్ల డిమాండ్ పై స్పందించేందుకు తెలుగుదేశం పార్టీకి మూడు గంటల టైమ్ లైన్ విధించారు. ఆ గడువులోగా తమ డిమాండ్ కు అంగీకరించకుంటే..  స్థానిక పోరులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పని చేయానికి వెనుకాడబోమని అల్టిమేటమ్ ఇచ్చారు.  
ఇదిలా ఉండగా, తిరుగుబాటు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలని చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులను ఆదేశించారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన వారిని సస్పెండ్ చేస్తామని  హెచ్చరించారు. జనసేన, బీజేపీలతో పొత్తు ఒప్పందాన్ని గౌరవించాలని మిత్రధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికారు. పొత్త ధర్మంలో భాగంగా సీట్లు దక్కని వారిని నామినేటెడ్ పదవులకు పరిశీలిస్తామని భరోసా ఇచ్చారు. 

అయితే జనసేన నుంచి మాత్రం ఇంత వరకూ అలాంటి ప్రకటన ఏదీ వెలువడలేదు. రెబల్స్ ను రంగం నుంచి తప్పుకోవాలన్న హెచ్చరిక, సూచన పవన్ నుంచి రాలేదు. బోలిసెట్టి వంటి వారి నోటి దురుసు ప్రకటనను ఖండించలేదు. అందుకే పవన్ మౌనం పొత్తు ధర్మం విషయంలో జనసేన చిత్తశుద్ధిపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేసింది. 


[Janasena TDP Seat Sharing, Pawan Kalyan Silence, AP Local Body Elections, NDA Alliance Andhra Pradesh, TDP and Janasena Dissent, Telugu One]

By
en-us Political News

  
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.