కూటమిలో చిచ్చుకు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం: అరికట్టాల్సిన బాధ్యత జనసేనానిదే.!

Publish Date:Oct 22, 2026

Advertisement

రాష్ట్రంలో ఒక కూటమి అధికారంలో ఉన్నప్పుడు, అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగడానికి లేదా కూటమి స్థిరత్వంపై తప్పుడు ప్రచారాలు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమి సర్కార్ బలంగా ఉన్నట్లు కనిపిస్తున్నా కూటమి ఐక్యత, సీట్ల సర్దుపాట్లు రాజకీయ వర్గాలలో చర్చలకు తావిస్తున్నాయి. ఇక పొత్తు విచ్ఛిన్నం ఊహాగానాలు సంచలనం రేపుతున్నాయి. 

తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  

మొదట, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు 40 శాతం సీట్లు దక్కుతాయని జనసేన అనుకూల సోషల్ మీడియా ఖాతాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాస్తవానికి వాస్తవానికి ఆ పార్టీకి పొత్తు ధర్మంలో భాగంగా పాతిక శాతం కంటే తక్కువ సీట్లు దక్కాయి. అంతకు ముందు 40 శాతం అంటూ జరిగిన ప్రచారం కారణంగా జనసేన శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులలో నిరాశ, నిస్ఫృహలు నెలకొన్నాయి. అది సహజం కూడా. కానీ మొదటే సోషల్ మీడియాలో అదీ జనసేన అనుకూల సామాజిక మాధ్యమంలో అతిగా జరిగిన తప్పుడు ప్రచారాన్ని అరికట్టలేకపోవడం జనసేన తప్పుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

అప్పుడు అరికట్టలేదు సరికదా.. ఆ తరువాత కూడా కూటమి ఐక్యతను దెబ్బతీసే ప్రచారం జనసేన అనుకూల సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది.  స్థానిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని, అలాగే ఆయన పార్టీకి చెందిన మంత్రులు కూడా తమ పదవుల నుంచి వైదొలగుతారంటూ సామాజిక మాధ్యమం  కథనాలు వండి వారుస్తుండటం కూటమి పార్టీలలో కలకలం సృష్టిస్తోంది.  సీట్ల సర్దుబాటులో జనసేనకు న్యాయం జరగలేదన్న అసంతృప్తి జనసేనానిలో ఉందనీ, అందుకే ఆయన రాజీనామా నిర్ణయానికి వచ్చారన్న ప్రచారం రాజకీయవర్గాలలో సంచలనం సృష్టిస్తోంది.  ఈ ప్రచారం జనసేన మద్దతుదారుల పేర జరుగుతుండటం గమనార్హం. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ లేదా సమర్థిస్తూ జనసేన నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో రాజీనామా ఊహాగాన సభలు జోరుగా సాగుతున్నాయి.  

వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ప్రోటోకాల్ ను కూడా పక్కన పెట్టి జనసేనాని చంద్రబాబు అధికారిక నివాసానికి వెళ్లి భేటీ అయిన తరువాత కూడా ఈ ప్రచారం ఆగలేదు.  ఇటువంటి ప్రచారాలు రాజకీయంగా, సామాజికంగా తప్పుడు అంచనాలకు, సంకేతాలకూ దారి తీసే ప్రమాదం ఉంది. ఈ రకమైన ప్రచారం ఇది కూటమి ఐక్యతకు ఏమంత మంచిది కాదని పరిశీలకులు అంటున్నారు. ఒక వైపు జనసేనాని పవన్ కల్యాణ్  15 ఏళ్ల పాటు కూటమి స్థిరంగా కొనసాగుతుందని పదే పదే చెబుతున్న వేళ.. అదే జనసేన అనుకూల సోషల్ మీడియా ఖాతాలలో పొత్తు విచ్ఛిన్నం అంటూ కథనాలు రావడం పార్టీ క్యాడర్ లో అయోమయానికి దారి తీస్తుంది. ఇటువంటి ప్రచారాన్ని నిర్ద్వంద్వంగా ఖండిచి అరికట్టాల్సిన బాధ్యత జనసేనానిపై ఉంది. 

ప్రజల్లో ప్రభుత్త్వంపై అనవసరమైన అనుమానాలు రేకెత్తించే ఉద్దేశంతోనే ఇలాంటి వదంతుల ప్రచారం  ఉద్దేశపూర్వకంగా  జరుగుతోందనడంలో సందేహం లేదు. పార్టీ పేరును అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నిరాధార వార్తలను సృష్టిస్తున్న సోషల్ మీడియా ఖాతాల తీరుపై జనసేన అధిష్టానం ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయకపోతే, రాబోయే రోజుల్లో ఇది పార్టీకి,  ప్రభుత్వ స్థిరత్వానికి  సవాలుగా మారే ప్రమాదం ఉంది.

ఈ తప్పుడు ప్రచారాలను సకాలంలో అడ్డుకోకపోతే, అది శ్రేణుల్లో   గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి జనసేన నాయకత్వం ఈ అంశంపై మరింత కఠినంగా వ్యవహరించి, అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగానూ,  పార్టీపరమైన   చర్యలు తీసుకోవాల్సిన అవసరం  ఉంది. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. 

[Jana Sena fake news Social Media,  Pawan Kalyan Resignation, Politics, Alliance, Andhra Pradesh, Jana Sena Social Media, Telugu One]

By
en-us Political News

  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.