రఘువీరారెడ్డి ఎందుకు సిగ్గుపడాలంటే....

Publish Date:Feb 19, 2015

Advertisement



తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తగుదునమ్మా అంటూ పోటీ చేసింది. అక్కడ ఎలాంటి ఫలితం రావాలో అలాంటి ఫలితమే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కనంత ఓటమిని మరోసారి చవిచూసింది. ఓటర్లు చెప్పిన తీర్పుని గౌరవిస్తూ తల వంచుకుని నిలబడితే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు మర్యాదగా వుండేది. అయితే తమ
సహజమైన శైలిలోనే తమ ఓటమికి, టీడీపీ గెలుపుకు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే... ఒక్క మాటలో చెప్పాలంటే ఒక శవం లాంటిది. ఆ శవానికి ప్రాణం తీసుకురాలేమని తెలిసినా ఏదో చికిత్స చేస్తున్నట్టు నటించే డాక్టర్‌ గారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సదరు శవానికి తాను చేస్తున్న ట్రీట్‌మెంట్ నటనను రక్తికట్టించే ప్రయత్నాల్లో భాగంగా అప్పుడప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడుతూ వుంటారు. పసలేని ఆరోపణలు చేస్తూ వుంటారు. తాజాగా తిరుపతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రఘువీరారెడ్డి ఒక గొప్ప కామెంట్ చేశారు. తిరుపతిలో ఎన్నిక జరిగిన తీరు చూసి తాను సిగ్గుపడుతున్నాడట. అయితే రఘువీరా గారు సిగ్గుపడాల్సింది తిరుపతి ఎన్నిక విషయంలో కాదు... ఆయన సిగ్గుపడాల్సిన విషయాలు వేరే వున్నాయి. వాటిలో కొన్నిటిని చూద్దాం.

1. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా పరిపాలించినందుకు...

2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందుకు...

3. ఆంధ్రప్రదేశ్‌ని ఏకపక్షంగా విభజిస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులు ముడుచుకుని కూర్చున్నందుకు...

4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని తెలిసినా ఇంకా ఏదో బావుకుందామని తాపత్రయపడుతున్నందుకు...

5. మీ పార్టీకి ఇంకా ఉనికి ఉందని భ్రమపడుతూ తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నందుకు....

6. ఓడిపోతామని తెలిసినా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసినందుకు....

7. మీ పార్టీ చేసిన అడ్డగోలు విభజన కారణంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చినందుకు...

8. ఇంత జరిగినా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమాత్రం సిగ్గుపడనందుకు...

9. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం వహించే దుర్గతి పట్టినందుకు....

.... ఇలా ఇన్ని కారణాలతో సిగ్గుపడాల్సిన అవసరం రఘువీరారెడ్డి గారికి వుంది.. మరి ఇప్పటికైనా సిగ్గుపడతారా...? సిగ్గుపడాల్సిన చోట సిగ్గు పడకపోవడం సిగ్గు సిగ్గు...

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.