సోనియా గాంధీ బిలాంగింగ్ పుస్తకం: వ్యక్తిగతమే కాదు.. రాజకీయ అభివ్యక్తీకరణ కూడా.!
Publish Date:Nov 15, 2026
Advertisement
సమకాలీన రాజకీయాలలో సోనియాగాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం పెను దుమారం రేపిందనడంలో సందేహం లేదు. ఈ పుస్తకం కేవలం ఆమె ఆత్మకథగానే కాకుండా, దేశ రాజకీయాలలో కీలకమైన మలుపులు, కుటుంబ బంధాలు, అంతర్గత సంఘర్షణలను సైతం బహిర్గతం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మకథ పుస్తకంలోని అంశాలపై, అందులో ప్రస్తావించిన వివాదాస్పద విషయాలు, అప్పటి రాజకీయాలలో వాటి ప్రభావంపై ఎడతెగని చర్చ జరుగుతోంది. పుస్తకంలోని చరిత్ర , వ్యక్తిగత జీవితం ఒకదానికొకటి ముడిపడి ఉండటం కూడా ఆ పుస్తకంపై పెను చర్చకు, భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడానికి కారణం అయ్యింది. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, భారత రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన సోనియా ప్రస్థానం అంతా విభేదాలు, వివాదాలు, విషాదాల సమాహారంగా సాగింది. అందులో సందేహం లేదు. అవే విషయాలను ఆమె తన ఆత్మకథలో పొందుపరిచారు. అయితే.. వాటిని పొందుపరిచే క్రమంలో ఆమె కొన్ని అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించారనీ, కొన్నిటిని అంతే ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారన్న చర్చ జోరుగా సాగుతోంది. అలాంటి వాటిలో ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ, అలాగే రాజీవ్ హయాంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సోనియాగాంధీ ప్రస్తావించిన అంశాలపై బీజేపీ సమా కాంగ్రెసేతర పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తమను తాము తటస్థంగా చెప్పుకునే వ్యక్తులు, మేధావులూ కూడా ఆమె ఆత్మకథలో ప్రస్తావించిన అంశాల నిష్పాక్షితపై సందేహాలువ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా సోనియా తన ఆత్మకథలో ప్రస్తావించారు. ఇదే ఆమె రాజకీయ ప్రత్యర్థులకు విమర్శించడానికి అవకాశం ఇచ్చింది. ఇక పోతే ఇప్పుడు ఆమె తన ఆత్మకథ ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశాలు, వ్యూహాలపై కూడా పలు రకాలుగా విమర్శలు, వ్యాఖ్యలు, కొండొకచో ప్రశంసలూ వ్యక్తమౌతున్నాయి. రాజకీయ నాయకులు ఆత్మకథ పేర పుస్తకాలు ప్రచురించడం సోనియాతోనే మొదలు కాలేదు కానీ, సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ ఒకే సమయంలో వివాదాలకు నిలయంగానూ, విశేష పాఠకాదరణ పొందడానికి కారణం ఆమె నేపథ్యం, ఆమె కుటుంబ నేపథ్యం, ఆమె కుటుంబంలో సంభవించిన విషాదాలే కారణం అని చెప్పవచ్చు. అయితే ఆమె తన పుస్తకంలో ప్రస్తవించిన కొన్ని అంశాల విషయంలో సంయమనం పాటింకకపోవడమే అసలు సమస్య అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.! ముఖ్యంగా సోనియా ఎమర్జెన్సీ, రాజీవ్ హయాంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను సమర్ధించే క్రమంలో నెపాన్ని పార్టీకే చెందిన కొందరు సీనియర్లపై నెట్టివేయడం ఏకకాలంలో కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా, రాజకీయ ప్రత్యర్థులకు విమర్శించడానికి ఒక అవకాశంగా మారిందంటున్నారు. అందుకే సోనియా గాంధీ పుస్తకం బిలాంగింగ్ పై కాంగ్రెస్ లోనే కొన్ని వర్గాల నుంచి భిన్న స్పందన వ్యక్తమౌతోంది. మొత్తంగా సోనియా బిలాంగింగ్: ఏ జెర్నీ ఆఫ్ లవ్ ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలను అందిస్తూనే, వ్యక్తిగతంగా ఆ కుటుంబం పడిన వేదనను కళ్లకు కట్టి నెహ్రూ కుటుంబ త్యాగాలను మరిచిపోతున్నతరానికి గుర్తు చేస్తున్నదన్న అభిప్రాయం పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతోంది. మీకు నచ్చవచ్చు: సోనియా ఆత్మకథలో అసలు నిజాలెన్ని.. వైట్‌వాషింగ్ అంటూ బీజేపీ విమర్శలు.! రాజీవ్ గాంధీకు నో.. రాహుల్‌కు ఓకేనా? సోనియా ఆత్మకథలో ఆసక్తికర విషయాలు.! [Sonia Gandhi, Belongingbook, Politics, autobiography, TeluguOne]
http://www.teluguone.com/news/content/sonia-gandhi-45-237161.html




