Publish Date:Apr 28, 2012
కృష్ణాజలాలను రాష్ట్రానికి విడుదల చేసే విషయంలో కర్ణాటక ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోంది. మెహబూబ్ నగర జిల్లాలో సుమారు 70 వేల ఎకరాలకు జూరాల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. అయితే కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తేనే జూరాల ప్రాజెక్టుకు సాగునీరు అందుతుంది. జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటడంతో దానికింద సాగులో ఉన్న 70 వేల ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని జిల్లా రైతాంగం, రాష్ట్రప్రభుత్వం కోరుతున్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజ్ లో పడి సుమారు రెండు వారాలవుతోంది. ఐదు టిఎంసిల నీరు ఉంటే అధికారులు డెడ్ స్టోరేజీగా గుర్తిస్తారు. కానీ, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 4 టిఎంసిల నీరు మాత్రమే వుంది. ఈ ప్రాజెక్టు కింద సుమారు 70 వేల ఎకరాల వరిపంట ఆధారపడి ఉండి. నీరు సక్రమంగా అందితేనే మే నెల మొదటి, రెండో వారాల్లో పంటలు కోతకు వస్తాయి. కానీ, ప్రాజెక్టులో తగినంత నీరు లేకపోవటంతో వరిపంట ఎండిపోతోంది. ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం కర్ణాటక దృష్టికి తీసుకెళ్ళినా ఆ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోంది. తమ రైతులకే తాగునీరు చాలటం లేదనీ, ఇక జూరాల ప్రాజెక్టుకు నీరు ఎలా అందిస్తామని కర్ణాటక అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేష్టలుడిగి చూస్తుండటంతో 70 వేల ఎకరాల్లో వరిపంటకు ముప్పు ఏర్పడుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karnataka-government-stubborn-on-releasing-krishna-water-24-13695.html
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.