కొండా సురేఖ మాజీ ఓఎస్డీతో పాటు మరో ముగ్గురికి కోర్టులో ఊరట..!

Publish Date:Sep 9, 2026

Advertisement

మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరిపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయ స్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.కోర్టు ఆదేశాల ప్రకారం నలుగురూ ఒక్కొక్కరు రూ.25 వేల పూచీకత్తు బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం పోలీసుల ఎదుట సరెండర్ కావాలని న్యాయస్థానం సూచించింది. ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి ఘటనకు సంబం ధించి సుమంత్‌పై పోలీ సులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇనుప రాడ్లతో దాడి చేశారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. 

సుమంత్ డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం విదితమే...అయితే ఈ కేసులో పరారీలో ఉన్న సుమంత్‌ తో పాటు ఇతర నిందితుల కోసం చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ నిందితులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేయ డంతో వారికి తాత్కాలిక ఊరట లభించింది. మరోవైపు, సుమంత్‌కు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలపై తెలంగాణ హైకోర్టులోనూ విచారణ జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 1న హైకోర్టు ఆయనకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరిం చింది తాజా కోర్టు ఆదేశాల తో కేసు దర్యాప్తు తదుపరి దశకు చేరుకోనుంది. నిందితులు పోలీసుల ఎదుట సరెండర్ కావడం, అనంతరం దర్యాప్తు అధికారులు చేపట్టే చర్యలు కీలకంగా మారనున్నాయి.

 

 

(Konda Surekha, Former OSD Sumanth, Telangana High Court, CM Revanth reddy, Telugu One, Telugu News)

By
en-us Political News

  
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.