ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెన్షన్..!
Publish Date:Sep 8, 2026
Advertisement
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసుల అడ్డుకంపై నిరసన తెలిపిన క్రమంలో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను శాసన మండలి నుంచి ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో ప్రజాసమస్యలు, భూముల అంశాలు నిరసనలపై కాంగ్రెస్ - బీఆర్ఎస్ ల నడుమ ఘర్షణ వాతావరణం నెలకొంది. నల్ల చొక్కాలతో అసెంబ్లీకి చేరుకున్న బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు భద్రతా కారణాలతో గేటు వద్దే అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన వివాదంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్పీకర్ స్థానానికి, ఆయన సామాజిక వర్గానికి జరిగిన అవమానంగా కాంగ్రెస్ దీనిని చిత్రీకరించగా, తాము పోలీసుల తీరుపైనే మాట్లాడామని బిఆర్ఎస్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, శాసనసభ తీర్మానం మేరకు మండలి నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం రాజకీయ వేడిని మరింత పెంచింది. వ్యూహాలు పరిణామాలు.. శాసన సభాధిపతి దళిత వర్గానికి చెందిన స్పీకర్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశాన్ని కేవలం ఒక సభా నియమాల ఉల్లంఘనగా చూడకుండా, దళిత ఆత్మగౌరవ పోరాటంగా రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణగా మలిచింది. ప్రతిపక్షాన్ని డిఫెన్స్‌లో పడేసేందుకు ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రయోగించి అరెస్టుల వరకు వెళ్లడం కాంగ్రెస్ దూకుడు రాజకీయ వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది. Tata Madhu suspended, Naveen Kumar Reddy MLC, BRS MLCs arrested, Telangana Legislative Council suspension, Speaker Gaddam Prasad Kumar, Telangana political analysis, BRS Congress Assembly clash, SC ST Atrocities Act BRS MLCs,Telangana Legislative Assembly news
మరొకవైపు, బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల తీరుపై ప్రజల్లో ప్రతిఘటన పెంచే వ్యూహంతో ఉంది. ప్రతిపక్ష గొంతును నొక్కడానికి, తమ ప్రజాప్రతినిధులపై భౌతిక దాడి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. సభలో తమ నిరసన తెలియజేసే ప్రాథమిక హక్కును కాలరాస్తున్నారని బిఆర్ఎస్ భావిస్తోంది. అయితే, స్పీకర్ పట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ప్రతిపక్షం డిఫెన్స్‌లో పడాల్సి వచ్చింది.
http://www.teluguone.com/news/content/tata-madhu-suspended-24-231003.html





