కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి : సతీష్ మాదిగ

Publish Date:Sep 9, 2026

Advertisement

సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ మాల మాదిగ సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సతీష్ మాదిగ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళితు లను అవమానించేలా కేసీఆర్ వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్ కుటుంబ సభ్యురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సతీష్ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ తాము మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద డప్పు చప్పుళ్లతో నిరసన చేపట్టామని తెలిపారు.


ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లే రహదారులపై దళితులమైన తాము నడిచిన అనంతరం ఆ ప్రాంతాన్ని కేసీఆర్ తన అనుచరులతో పసుపు నీళ్లతో శుద్ధి చేయించారని సతీష్ మాదిగ ఆరోపించారు. దళితులు నడవడం వల్ల నేల మలినమైందనే భావనతోనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. దళితులంటే కేసీఆర్‌కు చిన్న చూపు ఉందని సతీష్ మాదిగ ఆరోపించారు. ఆయన ప్రోత్సాహంతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. 

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహ రించిన కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కేసీఆర్ చర్యలకు నిరసనగా ఆయన హయాంలో నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తా మని సతీష్ మాదిగ ప్రకటించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఈ విషయంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తా మని స్పష్టం చేశారు.

 

 

(SC, ST atrocity case should be filed against KCR, Satish Madiga, Erravalli Farmhouse, BRS MLC Tata Madhu, CM Revanth reddy, KTR, CP Sajjanar, DGP C,V, Anand, Telugu One, Telugu News)

By
en-us Political News

  
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.