కవితపై అభ్యంతరకర పోస్టులు.. కానిస్టేబుల్‌పై క్రిమినల్ కేసు..!

Publish Date:Sep 9, 2026

Advertisement

మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో  అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ సీఏఆర్ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై విధులు నిర్వహిస్తున్న ఏఆర్‌పీసీ-13584 కె. అనిల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో కవితను ఉద్దేశించి అసభ్యకర, అవమానకర భాషతో కూడిన అభ్యంతరకర కంటెంట్‌ను పోస్టు చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. 

ఫిర్యాదు అందిన వెంటనే సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది సోషల్ మీడియా వినియోగంలోనూ క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, మర్యాదను పాటించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే కె. అనిల్ అభ్యంతరకర పోస్టులు చేయడం ద్వారా శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, కర్తవ్య నిర్వహణలో లోపం, ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు పేర్కొంటూ *TSCS (CC&A) Rules-1964లోని రూల్-3ను ఉల్లంఘించినట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 **TS Civil Services (Classification, Control and Appeal) Rules, 1991లోని రూల్-8, సబ్‌రూల్-2(ఎ)* కింద ఉన్న అధికారాలతో అనిల్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్‌లో *క్రైమ్ నంబర్ 589/2026* కింద కె. అనిల్‌పై *BNS సెక్షన్లు 75, 79, ఐటీ యాక్ట్ సెక్షన్ 67* కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అభ్యంతరకర కంటెంట్‌ను అనిల్ తన సొంత మొబైల్ ఫోన్ ద్వారా పోస్టు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (FSL) పంపించారు. 

హైదరాబాద్ సీపీ నుంచి ప్రాథమిక విచారణ నివేదిక అందిన అనంతరం అంతర్గత శాఖాపరమైన విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం శిక్ష విధిస్తామని తెలంగాణ పోలీసులు తెలిపారు. ఆరోపణలకు సంబంధించిన శాఖాపరమైన విచారణలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహిళలపై దురుసు ప్రవర్తన, చట్ట ఉల్లంఘన, పోలీస్ సిబ్బంది దుష్ప్రవర్తన విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ *జీరో టాలరెన్స్ విధానం పాటిస్తోందని అధికారులు వెల్లడించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్ష నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగుచూసే అంశాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

 

 

(Kalvakuntla Kavitha, Telangana Police Department, Cyber ​​Crimes Police, FSL, Constable K. Anil, CM Revanth reddy, DGP C.V. Anand, CP Sajjanar, Telugu One, Telugu News)
 

By
en-us Political News

  
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో  దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.   
గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 
రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది.
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.