బీఆర్ఎస్ వర్సెస్ పోలీసులు.. అసలా రోజు ఏం జరిగింది?

Publish Date:Sep 9, 2026

Advertisement

తెలంగాణలో పొలిటికల్ హీట్ ను ఓ రేంజ్ లో పెచ్చరిల్లేలా చేసిస బీఆర్ఎస్ వర్సెస్ పోలీసుల ఘటనలో అసలేం జరిగిందనే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజు అంటే సోమవారం ( సెప్టెంబర్ 7)    అసెంబ్లీ ఆవరణలో వాస్తవంగా జరిగిందేమిటన్న విషయంపై ప్రభుత్వ, ప్రతిపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నాయి.  

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ  బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా  బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి, బీఆర్ఎస్ ప్రతినిధులకు మధ్య జరిగిన తోపులాట, ఘర్షణ  ఉద్రిక్తతకు దారితీసింది. కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగిన చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.  ఆ సందర్భంగా పోలీసులు మహిళా నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కొన్ని ఫొటోలను విడుదల చేసింది. అందుకు ప్రతిగా ఆరోజు వాస్తవంగా జరిగింది ఇదీ అంటూ ప్రభుత్వం కూడా కొన్ని ఫొటోలను విడుదల చేసింది. 

అసెంబ్లీలో వాస్తవంగా ఏం జరిగిందనే కోణంలో విడుదలైన ఈ తాజా  ఫొటోలు  రాజకీయ వర్గాల్లో   చర్చనీయాంశంగా మారాయి. కేవలం పోలీసులు మాత్రమే దూకుడుగా వ్యవహరించలేదనీ, బీఆర్ఎస్ ప్రతినిధులు కూడా పోలీసులను  ఇబ్బంది పెట్టారనే కోణాన్ని ఈ ఫోటోలు కళ్లకు కడుతున్నాయి. ఈ కొత్త చిత్రాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ భద్రతా సిబ్బందితో  ఘర్షణకు దిగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఘర్షణల సమయంలో కొందరు మహిళా పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వైనాన్ని ఈ ఫోటోలు బయటపెట్టాయి. 

బీఆర్ఎస్ నాయకులు  హద్దులు మీరి వ్యవహరించారనే వాదనను బలపరిచేలా ప్రభుత్వం ఈ ఫోటోలను విడుదల చేసింది. అయితే.. వీటిని బీఆర్ఎస్ పార్టీ   తిప్పికొడుతోంది. అసెంబ్లీలోకి తమను ప్రవేశించకుండా భద్రతా సిబ్బంది కావాలనే ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్త వాతావరణం సృష్టించారని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ ఘర్షణల హోరులో తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అగౌరవపరిచారని, దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఈ కొత్త చిత్రాల డ్రామాకు తెరలేపిందని ప్రతిపక్షం మండిపడుతోంది. మొత్తానికి, శాసనసభ వేదికగా చెలరేగిన ఈ రాజకీయ రగడ, వైరల్ అవుతున్న ఫోటోల వార్త రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


[Photo Fight Between BRS Congress, telangana assembly, brs leaders clash, ktr harish rao, police scuffle, assembly visuals, telangana news, Telugu One]

By
en-us Political News

  
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
గజ్వేల్‌లో కాంగ్రెస్–బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు   కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.