సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తోశారు : మంత్రి సీతక్క

Publish Date:Sep 9, 2026

Advertisement

మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నేతలది దారుణమైన ప్రవర్తన..!

విజువల్స్ విడుదల చేసిన మంత్రి సీతక్క..!

సొంత పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచితంగా, అసభ్యంగా వ్యవహరించడంపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన విజువల్స్‌ను మంత్రి సీతక్క విడుదల చేశారు.

మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మిల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తదితరులు వ్యవహరించిన తీరు ఆ విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

“మహిళా ఎమ్మెల్యేలను వెనుక నుంచి నెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు పక్కపక్కనే నిల్చున్నప్పుడు వారి మధ్యకు చొరబడాల్సిన అవసరం ఏమొచ్చింది? మహిళా ఎమ్మెల్యేలను తాకుతూ, నెడుతూ ముందుకు దూసుకెళ్లాల్సిన అవసరం ఏముంది?” అని మంత్రి ప్రశ్నించారు.

మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన అత్యంత అభ్యంతరకరంగా ఉందని ఆమె అన్నారు. ప్రజా ప్రతినిధులుగా మహిళల పట్ల గౌరవం పాటించాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేపై ఉంటుందని స్పష్టం చేశారు.“ధర్నా చేయొచ్చు.. నిరసన తెలపొచ్చు.. స్పీకర్‌ను కలిసి తమ సమస్యను చెప్పొచ్చు. కానీ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు” అని సీతక్క అన్నారు.

విజువల్స్‌తో కేటీఆర్ కుట్ర బయటపడింది..!

“విజువల్స్ అన్నీ ప్రజల ముందు ఉన్నాయి. ఎవరు ఎవరిని తోశారు? ఎవరు ఎవరిని నెట్టారు? ఎవరు ఎవరిని తాకుతూ ముందుకు వెళ్లారు? అన్నది ప్రజలే చూస్తున్నారు. కేటీఆర్ సైగలు చేసిన తీరు కూడా ఈ విజువల్స్‌లో కనిపిస్తోంది. కేటీఆర్ సైగ చేయగానే.. Brs మహిళా ఎమ్మెల్యేల ను వారి పార్టీ ఎమ్మెల్యేలు ముందుకు తోశారు. వారిని తాకుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. రాజకీయాల కోసం ఇంతలా దిగజారాలా  ” అని సీతక్క మండిపడ్డారు.“మహిళల గౌరవం గురించి మాట్లాడే బీఆర్ఎస్ నేతలు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనను చూసుకోవాలి. బయట నీతులు చెప్పడం కాదు.. ముందు తమ ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవాలి” అని మంత్రి అన్నారు.

మహిళా ఎమ్మెల్యేలే కాదు.. మహిళా పోలీసుల పట్ల కూడా ఇదే తీరుగా వ్యవహరించారు..!

అసెంబ్లీ వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పట్ల కూడా బీఆర్ఎస్ నేతలు అనుచితంగా వ్యవహరించిన ఘటనలను మంత్రి సీతక్క ప్రస్తావించారు.ప్రజలను, ముఖ్యంగా మహిళలను రక్షించాల్సిన మహిళా పోలీసులపైనే దురుసుగా వ్యవహరించడం దారుణం. విధుల్లో ఉన్న మహిళా పోలీసుల పట్ల కూడా గౌరవం లేకుండా ప్రవర్తించడం ఏ సంస్కారం?. కేటీఆర్ మహిళా పోలీస్ నడుము పై చేయి వేసి తోసేశారు అని మండిపడ్డారు.

“మహిళలను గౌరవించడం అంటే మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చూపించాలి. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేలనే గౌరవించలేని వారు రాష్ట్రంలోని మహిళల భద్రత, గౌరవం గురించి మాట్లాడటం హాస్యాస్పదం.” “అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. ఇక్కడ నిరసనకు హక్కు ఉంది.. ప్రశ్నించే హక్కు ఉంది.. కానీ మహిళల పట్ల అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారు. విజువల్స్ అన్నీ ప్రజల ముందే ఉన్నాయి. నిజం ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు.” అని స్పష్టం చేశారు.

 

 

 

(Minister Sitakka, BRS MLAs Gangula Kamalakar, Sudheer Reddy, MLC Naveen Reddy, KTR, KCR, BRS Party, Telangana Assembly session, CM Revanth Reddy, Telangana political news, Telugu One, Telugu News)

By
en-us Political News

  
హైదరాబాద్ రోడ్డుపై మరమరాలు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ  బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా  బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.