అర్నాబ్ ఎఫెక్ట్: కోనసీమ అంధకారం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, తగ్గని గాలుల తీవ్రత.!

Publish Date:Oct 28, 2026

Advertisement

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను అర్నాబ్ తుపాను తీవ్రంగా వణికించింది. నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.

  ప్రచండ గాలులకు కోనసీమలోని 19 మండలాల పరిధిలో భారీ వృక్షాలు, వందలాది కొబ్బరి చెట్లు నేలకూలాయి. అలాగే అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాత్రి సమయంలో కోనసీమలోని పలు ప్రాంతాలు పూర్తిగా అంధకారంలో మగ్గాయి. రహదారులపై భారీ చెట్లు అడ్డంపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో గతంలో సంభవించిన ఉప్పెనను గుర్తు చేసుకుని తీరప్రాంత ప్రజలు భయంతో వణికి పోయారు.   కోనసీమలో వీచిన బలమైన గాలుల హోరు గతంలోని పెను తుపానులను తలపించేలా ఉందని స్థానికులు తెలిపారు.  

విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో   సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రహదారులపై పడిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు యంత్రాంగం శ్రమించింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ప్రయాణాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పలు ప్రాంతాల్లో వరి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, నిరంతర పర్యవేక్షణ కారణంగా ప్రాణనష్టం  జరగలేదని అధికారులు చెప్పారు.  తుపాను కారణంగా జరిగిన ఆస్తినష్టం, విద్యుత్ వ్యవస్థ ధ్వంసం కావడం వంటి సమస్యలతో సాధారణ పరిస్థితులు కుదుటపడటానికి కొంత సమయం పట్టేలా ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు.


[Cyclone Arnab Effect on , Konaseema, Power Supply, Heavy Rain, Strong Winds, Waterlogg,  TeluguOne]

By
en-us Political News

  
ఎండల తీవ్రత, ఎల్ నినో ఎఫెక్ట్ తో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుతుండటంతో తిరుమలలో భక్తులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం  అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా నీటి పొదుపు, సమర్థవంతమైన నీటి యాజమాన్య చర్యలను ప్రారంభించింది
మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించామనీ   ఆ హామీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్  స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలు సవరించబడతాయని చెప్పారు.
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.