చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్: తెల్లవార్లూ సమీక్షలు.. కనిష్టానికి అర్నబ్ నష్టం.!
Publish Date:Oct 28, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ పై పంజా విసిరిన అర్నాబ్ తుపానును ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్షణం విశ్రాంతి తీసుకోకుండా రాత్రంతా వరుస సమీక్షలతో అధికారులకు దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు. పెను తుపాను కారణంగా సంభవించే నష్టాన్ని కనిష్టానికి తగ్గించాలన్న ఏకైక లక్ష్యంతో, సంకల్పంతో ఆయన నిద్రపోలేదు, అధికార యంత్రాగాన్ని నిద్రపోనివ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని కుండపోత వర్షాలు, ప్రచండగాలులూ వీస్తుంటే.. చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ జాగారం చేశారు. అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తుపాను తీవ్రతపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ.. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్లు, RTGS అధికారులతో నిరంతరాయంగా సంభాషిస్తూ, నష్ట నివారణ చర్యలు, సహాయ, పునరావాస కార్యాచరణపై ఎప్పటికప్పుడు సూచనలూ, సలహాలు, అవసరమైన ఆదేశాలూ జారీ చేశారు. నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటవెంటే తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలనీ, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలించిన వెంటనే మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.
[CBN Guidence Helped, Arnab Damage Minimum, Directions, Administration, Cyclone, Seviority, Review, Whole, Night, Telugu One]
http://www.teluguone.com/news/content/cbn-guidence-helped-43-235588.html





