పేమెంట్ క్వార్టర్, అకడమిక్ ఇయర్ తేడా తెలుసుకోండి: జగన్ కు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్.!

Publish Date:Nov 19, 2026

Advertisement

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల గణాంకాలపై వైసీపీ అధినేత జగన్   విమర్శలకు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఘాటుగా బదులిచ్చారు. బడ్జెట్ లెక్కలు, చెల్లింపుల విధానంపై జగన్ కు కనీస అవగాహన కూడా లేదని ఆయన మాటల ద్వారా వెల్లడైందన్నారు.  నిధులు విడుదల చేసే త్రైమాసికానికి (పేమెంట్ క్వార్టర్), ఆ నిధులు వర్తించే విద్యా సంవత్సరానికి (అకడమిక్ ఇయర్) మధ్య ఉన్న తేడా కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.    2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి  మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించామనీ   ఆ హామీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్  స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలు సవరించబడతాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరిగేదని, దాంతో విద్యార్థులు తమ సొంత డబ్బుతో ఫీజులు కట్టాల్సిన దుస్థితి తలెత్తిందని ఆరోపించారు.   

ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా నిధులను నేరుగా కళాశాలలకే జమ చేస్తోందని లోకేశ్ వివరించారు. ఇందుకు సంబంధించిన ఫ్యాక్ట్ షీట్ ను విడుదల చేశారు. ప్రతి నెలా నిరంతరాయంగా  200 కోట్ల నుంచి  300 కోట్ల రూపాయల వరకూ  పెండింగ్ బకాయిలను క్లియర్ చేస్తున్నామని..  మిగిలిన బకాయిలన్నింటినీ దశలవారీగా   చెల్లిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని జగన్‌కు హితవు పలికారు.  

 మంత్రి విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, జూన్ 2024 నాటికి మానవ వనరుల శాఖ పరిధిలో  3 వేల 828 కోట్ల బకాయిలు ఉండగా, జూన్ 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం  4 వేల 962.22 కోట్ల రూపాయలు విడుదల చేశారు.   విద్యా సంవత్సరాల వారీగా చూస్తే 2023–24 విద్యా సంవత్సరం వరకు రూ.193.02 కోట్లు, 2024–25 విద్యా సంవత్సరానికి రూ.3,060.48 కోట్లు, 2025–26 విద్యా సంవత్సరానికి రూ.1,708.72 కోట్లు విడుదల అయ్యాయి. 

అలాగే ఆర్థిక సంవత్సరాల వారీగా 2024–25లో రూ.1,451.38 కోట్లు, 2025–26లో రూ.1,665.21 కోట్లు, 2026–27లో రూ.1,845.63 కోట్లు విడుదల అయ్యాయి.   కార్పొరేషన్ల వారీగా పంపిణీ చేసిన నిధుల వివరాలను కూడా ఫ్యాక్ట్ షీట్‌లో పొందుపరిచారు. దీని ప్రకారం బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.2,079.01 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.1,337.29 కోట్లు, ఓసీ విభాగం ద్వారా రూ.1,042.28 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రూ.283.61 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.220.02 కోట్లు పంపిణీ  అయ్యాయి. 

ఇది కూడా చదవండి:  ఏపీలో జాతీయ సగటును మించి అక్షరాస్యులు.. లోకేష్.!​

 ఈ గణాంకాలన్నీ విద్యా రంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందనడానికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు.   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశం కళాశాలల నిర్వహణ, విద్యార్థుల ఉన్నత విద్య కొనసాగింపుతో ముడిపడి ఉన్న కీలక అంశం కావడంతో జగన్ విమర్శలకు లోకేష్ ఇచ్చిన కౌంటర్ ప్రాధాన్యత సంతరించుకుంది.  

 రానున్న నెలల్లో ప్రతి నెలా రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర బకాయిల చెల్లింపులు ఏ విధంగా కొనసాగుతాయో, పెండింగ్ నిధుల క్లియరెన్స్ ఎంత వేగంగా పూర్తవుతుందో చూడాలి. విద్యా సంవత్సరం, ఆర్థిక సంవత్సరం లెక్కల మధ్య సమన్వయంతో నిధులు సకాలంలో అందుతుండటంతో కళాశాలలకు ఊరట లభిస్తుందని పరిశీలకులు అంటున్నారు.  మొత్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ గణాంకాలపై లోకేశ్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ఈ వివాదానికి సంబంధించిన ప్రభుత్వ లెక్కలను ప్రజల ముందు ఉంచింది. మిగిలిన బకాయిలను త్వరగా తీర్చి విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతోంది. 

మీకు నచ్చవచ్చు:  వెయ్యి పాఠశాలలకు 5-స్టార్ హోదా.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు.!

విద్యాహక్కు చట్టం.. భారీగా పెరిగిన అడ్మిషన్లు.. మండలిలో లోకేష్.!​

[AndhraPradesh, Fee Reimbursement, Nara Lokesh, YS Jagan, Fact Sheet, TeluguOne]

By
en-us Political News

  
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భారీగా గ్యాస్ లీకౌతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్త మౌతున్నాయి. 
ఈ మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు,ప్రతినిధులు,  సంబంధిత వర్గాలు తమ  సూచనలు, సలహాలు, అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేయడానికి వచ్చే నెల  31 వరకు గడువు విధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.