బెజవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు: సతీసమేతంగాఅమ్మవారికి పూజలు.!

Publish Date:Oct 16, 2026

Advertisement

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు   వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శుక్రవారం (అక్టోబర్ 16)  మూలానక్షత్ర తిథి పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తిన తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా  అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పవిత్ర వేడుకలో భాగంగా ఇంద్రకీలాద్రికి విచ్చేసిన సీఎం చంద్రబాబు దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు, కార్యనిర్వహణాధికారి ఘన స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం, వారు ఆలయ గర్భాలయంలో కొలువుదీరిన కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, సాంప్రదాయ సారె  సమర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పూజల ముగింపులో వేద పండితులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

మూలానక్షత్రం కావడంతో ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. అమ్మవారు ఈ రోజు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుండటంతో, విద్యార్థులు, తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచే కొండపైకి బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విపరీతమైన రద్దీ కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

భక్తుల రద్దీని నియంత్రించేందుకు మరియు క్యూలైన్ల రద్దీని తగ్గించేందుకు ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూలానక్షత్ర రోజున వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ శీఘ్రదర్శన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గంటగంటకూ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.

ఈ శరన్నవరాత్రుల వేడుకలు విజయవాడ నగరంలో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది.  


[CM Chandrababu Naidu Perform Puja Bejawada Kanakadurgmma, Indrakeeladri Dasara Navratri, Goddess Durgamma, Moola Nakshatram, Vijayawada Kanaka Durga Temple, Telugu One]

By
en-us Political News

  
మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించామనీ   ఆ హామీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్  స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలు సవరించబడతాయని చెప్పారు.
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
ఆ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. భారీగా గ్యాస్ లీకౌతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలు వ్యక్త మౌతున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.