వినుకొండ, గుంటూరు నాలుగు లైన్ల ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం: మూడు జిల్లాల మీదుగా నేషనల్ హైవే.!

Publish Date:Oct 16, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు పడింది.  పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా సాగే కీలకమైన జాతీయ రహదారి విస్తరణకు మార్గం సుగమమైంది. అనంతపురం నుంచి గుంటూరు వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే-544డీ ప్రాజెక్టులో భాగంగా..  వినుకొండ నుంచి గుంటూరు వరకు ఉన్న మార్గాన్ని నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు అధికారులు   ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదికసిద్ధం అయ్యింది. 

ఈ మొత్తం రహదారి ప్రాజెక్టు అంచనా వ్యయం  3 వేల 476 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. దీని ద్వారా ప్రయాణికులకు రవాణా మరింత సులువు కావడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. మొత్తం 85.9 కిలోమీటర్ల పొడవున సాగే ఈ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా, దాదాపు 41.29 కిలోమీటర్ల మేర పూర్తిగా   గ్రీన్‌ఫీల్డ్ హైవేను నిర్మించనున్నారు. మిగిలిన మార్గాన్ని ప్రస్తుత రోడ్డును బ్రౌన్‌ఫీల్డ్ విధానంలో అభివృద్ధి చేసి నాలుగు లైన్లుగా తీర్చిదిద్దనున్నారు. దీనికోసం సంబంధిత మూడు జిల్లాల పరిధిలో సుమారు 45 మీటర్ల వెడల్పుతో అవసరమైన భూసేకరణ చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు.

ఈ రహదారి ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా రద్దీని తగ్గించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో ప్రత్యేక బైపాస్‌లను నిర్మించనున్నారు. వినుకొండ నుంచి శావల్యాపురం వరకు, సంతమాగులూరు నుంచి పాతమాగులూరు వరకు, పెట్లూరివారిపాలెం, జొన్నలగడ్డ, సాతలూరు అలాగే ఫిరంగిపురం, పేరేచెర్ల ప్రాంతాల వద్ద మొత్తం ఆరు చోట్ల బైపాస్‌లు రూపుదిద్దుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ మార్గంలో ఐదు చోట్ల రైల్వే లైన్లు హైవేను దాటి వెళ్లేలా వంతెనల నిర్మాణాలు కూడా ప్రతిపాదించారు. భద్రత, ఇంజనీరింగ్ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని డీపీఆర్ రూపకల్పన సమయంలోనే అన్ని ప్రాంతాల్లో సమగ్ర మట్టి పరీక్షలు నిర్వహించడం జరిగింది.

అనంతపురం నుంచి గుంటూరు వరకు సాగే ఈ జాతీయ రహదారి ప్రాజెక్టును అధికారులు పలు భాగాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుగ్గ నుంచి గిద్దలూరు వరకు, అలాగే వినుకొండ నుంచి గుంటూరు వరకు నాలుగు వరుసల రహదారులుగా మారుస్తుండగా, గిద్దలూరు నుంచి వినుకొండ వరకు మాత్రం ప్రస్తుతానికి రెండు వరుసల మార్గంగానే కొనసాగించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వినుకొండ, గుంటూరు మార్గానికి సంబంధించిన ఎలైన్‌మెంట్‌కు ఇప్పటికే ఆమోదం లభించగా, తాజాగా డీపీఆర్ కూడా సిద్ధమవ్వడంతో పనుల్లో వేగం పుంజుకోనుంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాజెక్టుకు తుది క్లియరెన్స్ లభించి, కేంద్ర కేబినెట్ ఆమోదం రాగానే భూసేకరణ,  టెండర్ల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడమే కాకుండా, స్థానిక ఆర్థికాభివృద్ధికి కూడా  దోహదపడుతుంది.  


[Key Developement Vinukonda Guntur Highway, National Highway 544D, AP Road Projects, Four Lane Highway, National Highway DPR, Telugu One]

By
en-us Political News

  
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.